ఇంట్లో మెడిసిన్స్ ని ఎక్కడ పెడుతున్నారు.. జబ్బులు త్వరగా తగ్గాలంటే ఈ చోట ఉంచండి..!

ఇంట్లో మనం వాడే మందులు ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు సహాయపడతాయి. అయితే అవి ఎక్కడ ఉంచాలో తెలియక యథేచ్ఛగా ఉంచితే కొన్ని అనర్థాలు జరుగుతాయి. మందులను సరిగ్గా నిర్వహించకపోతే అనారోగ్య సమస్యలే కాకుండా ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాస్తు చిట్కాలు పాటించడం చాలా అవసరం.

ఇంట్లో మెడిసిన్స్ ని ఎక్కడ పెడుతున్నారు.. జబ్బులు త్వరగా తగ్గాలంటే ఈ చోట ఉంచండి..!
Medicines Storage Mistakes

Updated on: Jun 02, 2025 | 6:10 PM

ఈరోజుల్లో ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఏదో ఒక వైద్య సహాయం అవసరం అవుతుంది. ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా అందరి ఇళ్లలోనూ మందులు ఉంటున్నాయి. కొంతమంది మందులను టేబుల్‌ పై పెడుతారు.. మరికొందరు ఫ్రిజ్‌ లో పెడుతుంటారు. మందులను అల్మారాలో వేసేవారూ ఉంటారు. ఎవరికి ఎలాగైతే సౌకర్యంగా ఉంటుందో అలా ఉంచేస్తుంటారు.

వాస్తు ప్రకారం మందులను తప్పు ప్రదేశాల్లో ఉంచితే అవి మంచిగా పని చేయవు. ఒకవేళ ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఇంకా ఎక్కువ ఇబ్బందులకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాధి కంట్రోల్ కాకుండా పెరుగుతుంటే అదనపు ఖర్చులు పడుతుంటాయి. దీని వలన ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థికంగా నష్టం జరుగుతుంది.

వాస్తు నిపుణుల ప్రకారం.. మందులను ఉంచడానికి ఉత్తర దిశతో పాటు ఈశాన్య దిశ కూడా మంచిదిగా భావిస్తారు. ఈ రెండు దిశల మధ్య ఉండే ప్రదేశం శుభంగా ఉంటుంది. అక్కడ ఉంచిన మందులు శరీరానికి త్వరగా పని చేస్తాయి. ఎలాంటి ఔషధమైనా దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వేగంగా తగ్గుతాయి.

ఈశాన్య దిశ శాంతియుతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అక్కడ సానుకూల శక్తి బలంగా ఉంటుంది. ఆ శక్తి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మందులు అక్కడ ఉంచినప్పుడు అవి శరీరంపై త్వరగా పనిచేస్తాయి. వ్యాధిని తగ్గించడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం మందులు ఈశాన్య దిశలో ఉంచితే వాటి ప్రభావం రెట్టింపు అవుతుంది. శరీరానికి ఆ మందులు వేగంగా స్పందిస్తాయి. అనారోగ్యం నుంచి కోలుకోవడంలో ఇది సహాయపడుతుంది. మందుల ప్రభావం మెరుగవ్వడం వలన చికిత్స సమయంలో త్వరగా మంచి ఫలితాలు కనిపిస్తాయి. దీనివల్ల చికిత్స వేగంగా పూర్తవుతుంది.

ఈశాన్య దిశలో వెలుతురు ఎక్కువగా ఉంటుంది. ఉదయం సూర్యకాంతి అక్కడికి బాగా చేరుతుంది. గాలి ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. ఇవన్నీ కలిసి శరీరానికి శుభ శక్తిని అందిస్తాయి. అందుకే ఈ ప్రదేశంలో మందులను ఉంచితే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలాగే అవి తక్కువ మోతాదులోనే మంచిగా పని చేస్తాయి.

ఇంట్లో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన వస్తువుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మందులు ఉంచే స్థలాన్ని వాస్తు ప్రకారం నిర్ణయిస్తే ఆరోగ్య సమస్యలపై అదుపు సాధ్యమవుతుంది. ఇది ఇంట్లో శుభతనాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)