చలికాలంలో చర్మాన్ని సంరక్షించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో అనేక రకాలైన చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతుంటాయి. వింటర్ సీజన్‌లో పొడిగాలి చర్మంలోని తేమను గ్రహించడం వల్ల స్కిన్ మెరుపు కోల్పోతుంది. చర్మం పొడిబారుతుంది. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై పగుళ్లు ఏర్పడతాయి. చర్మంపై తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. చర్మం పొడిగా, దురదగా, ఎర్రగా మారుతుంది. కాబట్టి చలికాలంలో చర్మ సంరక్షణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే, చలికాలంలో ముల్తానీ మిట్టిని ఉపయోగించటం వల్ల చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తాని మిట్టి క్రిమినాశక లక్షణాలను కలిగి ఉన్నందున మొటిమలు, మచ్చలు, టానింగ్ మొదలైన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో మీ ముఖాన్ని మెరిసేలా చేసే ముల్తానీ మిట్టిని అప్లై చేసే విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ముల్తానీ మిట్టి, తేనెను ఉపయోగించవచ్చు. దీని కోసం ముల్తానీ మిట్టి, తేనెను బాగా మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసిన 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ రెసిపీని వారానికి రెండుసార్లు ప్రయత్నించండి. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.
మరో పద్ధతిలో ముల్తానీ మిట్టిని పాలలో కలిపి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మం కూడా మెరుగుపడుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి..
ముల్తానీ మిట్టిలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, ముఖంపై గీతలు, చారలు వంటివి తగ్గుతాయి. ముఖం కూడా కొత్త తేజస్సు వస్తుంది. అలాగే, చలికాలంలో వారానికి ఒకటి లేదా రెండుసార్లు సున్నితమైన హైడ్రేటింగ్ మాస్క్‌ను అప్లై చేసకోండి. దీని వల్ల మీ చర్మం తేమగా ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..