Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urine Colour Alert: మీ మూత్రం మూత్రపిండాల ఆరోగ్యాన్ని చెబుతుందని తెలుసా..! ఈ రంగులో కనిపిస్తే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..

సాధారణం మనకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యకు రకరకాల మెడిసిన్స్ తీసుకునే సమయంలో మూత్రం పసుపు రంగులోకి మారుతుంది. కొన్నిసార్లు మనం తినే ఆహారాన్ని బట్టి రంగు కూడా మారుతుంది. ఇది ఒక సాధారణ విషయం. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రం ఎరుపు, తెలుపు, ముదురు పసుపు రంగులలో కనిపిస్తుంది. ఇలా మూత్రం రంగు మారడానికి బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి మంచి మూత్రం ఏ రంగులో ఉంటుంది? మూత్రం ముదురు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారితే దాని అర్థం ఏమిటో తెలుసుకుందాం

Urine Colour Alert: మీ మూత్రం మూత్రపిండాల ఆరోగ్యాన్ని చెబుతుందని తెలుసా..! ఈ రంగులో కనిపిస్తే కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..
Urine Color Alert
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2025 | 6:42 PM

మన ఆరోగ్యం ఎలా ఉందో మనం అనేక విధాలుగా తెలుసుకోవచ్చు. మన శారీరక ఆరోగ్య సమస్య గురించి మనకు తెలియజేసేందుకు శరీరం మనకు అనేక రకాల హెచ్చరికలను జారీ చేస్తుంది. వాటిలో మూత్రం ఒకటి. సాధారణంగా మన శరీరం పనితీరు అనేక ఆరోగ్య సమస్యల గురించి వెల్లడిస్తుంది. నోటి ద్వారా తినే ఆహారంలో ఉండే విషాన్ని తొలగించే పనిని మూత్రపిండాలు చేస్తాయి. అందుకే మూత్రపిండాల ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకోవాలి. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే.. ఈ సమస్య నుంచి బయటపడటం అంత సులభం కాదు. కనుక మన మూత్రం రంగును బట్టి మూత్రపిండాలు ఎలా పనిచేస్తున్నాయో గుర్తించవచ్చని వైద్యులు అంటున్నారు. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురైతే, మూత్రం రంగులో వెంటనే మార్పు వస్తుంది. అయితే అది ఎలా తెలుసుకోవాలి? మూత్రం ఏ రంగు మంచిది?తెలుసుకుందాం..

సాధారణంగా లేత పసుపు రంగులో మూత్రం ఉంటుంది.. అయితే కొన్ని సందర్భాల్లో, మూత్రం ఎరుపు, తెలుపు, ముదురు పసుపు రంగులలో కనిపిస్తుంది. ఇలా మూత్రం రంగు మరెందుకు బలమైన కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఎరుపు రంగు

కొన్నిసార్లు.. బీట్‌రూట్ వంటి ఆహార పదార్థాలను తినేటప్పుడు మూత్రం ఎర్రగా మారుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మూత్రం ఎరుపు రంగులో ఉంటే.. అది మీ మూత్రపిండాల వ్యాధిని గురించి హెచ్చరిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే మూత్రం రక్తం రంగులోకి మారుతుంది. అందుకే ఈ లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్షం చేయకుండా వాటిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

ముదురు పసుపు, నారింజ రంగు

మూత్రం సహజ రంగు లేత పసుపు. అయితే ముదురు పసుపు, నారింజ రంగు మూత్రం మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరమని సూచిస్తుంది. అధిక పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, వేడి ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

పాల రంగు

మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు.. మూత్రం తెల్లగా కనిపిస్తుంది. ఇలా తెల్లగా మూత్రం ఉంటే బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లను సూచిస్తుంది.

కాఫీ రంగు

మూత్రం కాఫీ రంగులో లేదా గోధుమ రంగులో ఉంటే.. అది కాలేయ వ్యాధిని సూచిస్తుంది. ఈ సందర్భాలలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ఆకుపచ్చ లేదా నీలం రంగు

మూత్రం ఆకుపచ్చగా మారడం బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. లేదా కృత్రిమ రంగులు ఉపయోగించే ఆహారాన్ని తిన్నప్పుడు కూడా, మీ మూత్రం ఆకుపచ్చ లేదా నీలం రంగులో ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)