
నేటి కాలంలో చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు నెరిసిపోతుంది. ఒకప్పుడు వయసు మీద పడిన వారికి మాత్రమే జుట్టు తెల్లబడేది. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. ఈ సమస్య యువతలో అధికంగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లేవారికి ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చిన్నతనంలోనే జుట్టు నెరియడానికి కారణం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు ఈ రకమైన సమస్యకు కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చిన్న వయసులోనే సహజంగా నల్లగా ఉండే జుట్టు.. క్రమంగా తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మద్యం సేవించడం. అధికంగా మద్యం సేవించడం వల్ల ఎక్కువగా తాగే వారి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, వారి జుట్టు కూడా తెల్లగా మారుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అతిగా ఆల్కహాల్ తీసుకోవడమే కాకుండా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది.
రోజూ టీ, కాఫీ తీసుకోవడం సర్వసాధారణం. కానీ పరిమితికి మించి ఎక్కువగా టీ, కాఫీ తాగే వారికి జుట్టు తెల్లబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలోని కెఫిన్ శరీరం పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా జుట్టు బూడిద రంగులోకి మారుతుంది.
ఈ రోజుల్లో వేయించిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం అలవాటై పోయింది. కానీ మీకు తెలుసా? మనం తినడానికి ఇష్టపడే వేయించిన ఆహారాలలో ఎక్కువ పోషకాలు ఉండవు. వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు లోపానికి దారితీయవచ్చు. దీనివల్ల జుట్టు తెల్లబడవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
అదేవిధంగా ఉప్పు, చక్కెరతో తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాదు ఇది జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అధికంగా తీసుకుంటే తలపై నల్లటి జుట్టంతా తెల్లగా మారే ప్రమాదం ఉంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.