Kitchen Hacks: వంట చేసేటప్పుడు ఈ ట్రిక్స్ ట్రై చేయండి.. వంటలు రుచిగా ఉంటాయి!

వంటలు తయారు చేయడం అంత ఈజీగా కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు. వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మెలకువలు పాటిస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి. నిజంగా వంట చేయడం కూడా ఒక కళ. అయితే ఒక్కోసారి వంటల టేస్ట్ అంతగా బాగుండదు. ఉప్పు ఎక్కువ అవడం లేదా కారం ఎక్కువ అవడం, రుచి సరిగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఈ ఫుడ్ అంతా వేస్ట్ అవుతుందేనని..

Kitchen Hacks: వంట చేసేటప్పుడు ఈ ట్రిక్స్ ట్రై చేయండి.. వంటలు రుచిగా ఉంటాయి!
Kitchen Hacks

Updated on: May 31, 2024 | 1:24 PM

వంటలు తయారు చేయడం అంత ఈజీగా కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు. వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మెలకువలు పాటిస్తే.. ఎంతో రుచిగా ఉంటాయి. నిజంగా వంట చేయడం కూడా ఒక కళ. అయితే ఒక్కోసారి వంటల టేస్ట్ అంతగా బాగుండదు. ఉప్పు ఎక్కువ అవడం లేదా కారం ఎక్కువ అవడం, రుచి సరిగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. దీంతో ఈ ఫుడ్ అంతా వేస్ట్ అవుతుందేనని ఆడవారు తెగ భయ పడిపోతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని చిట్కాలు పాటిస్తే వంట ఎంతో రుచిగా వస్తుంది. సింపుల్ చిట్కాలే.. రెసిపీలను టేస్టీగా మార్చుతాయి. మరి ఆ సింపుల్ చిట్కాలు ఏంటి? వాటితో మీ వంటలను ఎలా రుచిగా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

నిమ్మరసం:

నిమ్మరసం ఉపయోగించడం వల్ల వంటలకు ఎంతో రుచి వస్తుంది. ఈ నిమ్మరసంతో కూరలు టేస్టీగా వస్తాయి. కుక్కర్‌లో మిక్స్డ్ రైస్, బిర్యానీలు వంటివి తయారు చేసేటప్పుడు కొద్దిగా మూత తెరిచి అందులో నిమ్మరసం వేసి కలపండి. ఇలా చేస్తే రైస్ చక్కగా ఉడుకుతుంది. అంతే కాకుండా మెతుకులు అంటుకోకుండా ఉంటాయి. రుచి కూడా పెరుగుతుంది.

పకోడీలు:

కాలం ఏదైనా సరే.. అప్పుడప్పుడూ వేడి వేడి పకోడీలు తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి పకోడీలు క్రిస్పీగా అవుతూ ఉంటాయి. ఇలా కాకూడదంటే.. పకోడీలు తయారు చేసేటప్పుడు వేరు శనగలను చేసి.. శనపిండితో కలపండి. దీని వల్ల పకోడీలు క్రంచీగా, రుచిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

టమాటా రైస్:

చాలా మంది టమాటా రైస్‌ తయారు చేస్తూ ఉంటారు. ఈ రైస్‌ని బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌గా కూడా తినవచ్చు. టమాటా రైస్ ఒక్కోసారి సరిగా రాదు. రుచి కూడా అంత బాగా ఉండదు. ఈ సారి టమాటా రైస్‌ని ఎప్పుడూ ఒకలానే కాకుండా.. పచ్చి మిర్చి, అల్లం, టమాటాలను గ్రైండ్ చేసి.. అందులో కలపండి. దీంతో రుచి మాత్రమే కాకుండా సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది.

అప్పడాలు:

అప్పడాలు త్వరగా చప్పపడిపోతూ ఉంటాయి. అలాగే కొంత మందికి క్రంచీగా తినడం ఇష్టం. అలా తింటేనే అప్పడాలు తిన్నట్టు ఉంటుంది. చాలా మంది అప్పడాలను నూనెలో వేయిస్తూ ఉంటారు. ఈసారి అలా కాకుండా అప్పడానికి రెండు వైపులా ఆయిల్ రాసి.. స్టవ్ మీద కాల్చండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..