తలపై ఉండే కణాలు దుమ్ములాగా రాలిపోతే దాన్ని సాధారణ చుండ్రు అంటాం. ఇది మామూలుగా ఉంటే పర్వాలేదు..కానీ, చుండ్రు సమస్య తీవ్రమైతే మాత్రం అనేక సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు అనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. పొడి చర్మం, శిలీంధ్రాల పెరుగుదల లేదా ఇతర అంతర్లీన పరిస్థితులు వంటి అనేక అంశాలు చుండ్రుకు దారితీయవచ్చు. జుట్టు సంరక్షణపై కొంచెం శ్రద్ధ వహిస్తే చుండ్రును పూర్తిగా నివారించవచ్చు. స్కాల్ప్ సేబాషియస్ గ్రంధుల ద్వారా ఉత్పత్తి చేయబడిన సెబమ్ స్రావం మలాసెజియా అనే ఫంగస్ పెరుగుదలకు దోహదపడుతుంది. మలాసెజియా ఒక లిపోఫిలిక్ ఫంగస్. ఈ చర్య ఫలితం సెబమ్ నుండి కొవ్వు ఆమ్లాలను తయారు చేయడం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్ పై పనిచేసి మంటను కలిగిస్తాయి. ఇది చర్మ కణాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. మరిన్ని మృతకణాలను తొలగిస్తుంది. ఇది చుండ్రుకు దారితీస్తుంది. జుట్టుకు చుండ్రు విలన్.. ఎందుకంటే చుండ్రు పెరిగినప్పుడు జుట్టు రాలడం సర్వసాధారణం. అంతే కాకుండా చుండ్రు చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కాబట్టి చుండ్రును వదిలించుకోవడానికి మందులు వాడే బదులు, కూల్ హోం రెమెడీస్ ప్రయత్నించడం మంచిది.
చుండ్రును పోగొట్టడానికి ఆయుర్వేధంలో వేప ఉత్తమ ఔషధం. ఇది స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో, జుట్టు పెరుగుదలను మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చుండ్రు తొలగిపోతుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి జుట్టుకు పట్టించడమే. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు లేదా నాలుగు సార్లు చేస్తే చాలా మంచిది.
చుండ్రు సమస్యకు మెంతులు..
మెంతులు అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. జుట్టు రాలడం, చుండ్రును నివారిస్తుంది. ఇందుకోసం..ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకుని అందులో కొన్ని మెంతులు వేసి నానబెట్టాలి. ఒక రాత్రి అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయం నానబెట్టిన మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దానికి కాస్త నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట సేపు ఉంచాలి. బాగా ఆరిన తర్వాత షాంపూతో కడగాలి.
పెరుగుతో జుట్టుకు..
పెరుగు… చుండ్రును వదిలించుకోవడానికి చాలా సులభమైన మార్గాలలో పెరుగు ఒకటి. ముందుగా కాస్త పెరుగు తీసుకుని తలకు పట్టించాలి. దీన్ని మీ తలపై ఒక గంట పాటు అలాగే ఉంచి, ఆపై షాంపూతో కడగాలి. పెరుగుతో పాటు కొద్దిగా జీడిపప్పు పొడిని కలుపుకుంటే రెట్టింపు ప్రయోజనాలు అందుగాయి. విటమిన్ సి, జామకాయ జుట్టు పెరుగుదలకు మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..