వేధించే వైరల్ ఫీవ‌ర్‌ ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.. ట్రై చేయండి..

|

Oct 01, 2023 | 5:42 PM

వైరల్ జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. దీంతో మీరు తరచూగా రోగాల బారిన పడుతుంటారు..అలాంటి వారు ఈ సీజనల్ ఫ్లూ సమస్యను నివారించడానికి మీరు ఈ ఇంటి నివారణలను పాటించవచ్చు.

వేధించే వైరల్ ఫీవ‌ర్‌ ని తగ్గించే అద్భుతమైన ఇంటి చిట్కాలు.. ట్రై చేయండి..
Viral Fever
Follow us on

ప్రస్తుతం వాతావరణం విచిత్రంగా మారింది. ఒక్కోసారి వేడిగానూ, ఒక్కోసారి సడెన్‌గా వర్షం కురుస్తుంది. దీంతో పాటు క్రమంగా చలి మొదలవుతుంది. మారుతున్న వాతావరణం కారణంగా వైరల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న సీజన్లలో ఈ సమస్యలు సర్వసాధారణం. కానీ మీకు తరచుగా వైరల్ ఫీవర్ వస్తే, మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

మారుతున్న సీజన్‌లో మీరు కొన్ని వంటింటి చిట్కాలు పాటించివచ్చు. దీంతో మీరు వైరల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వైరల్ జ్వరం వచ్చినప్పుడు శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా తలనొప్పి, ఒళ్లు నొప్పులు వేధిస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. దీంతో మీరు తరచూగా రోగాల బారిన పడుతుంటారు..అలాంటి వారు ఈ సీజనల్ ఫ్లూ సమస్యను నివారించడానికి మీరు ఈ ఇంటి నివారణలను పాటించవచ్చు. ఇది మందు లేకుండా వైరల్ ఫీవర్ నయం చేస్తుంది.

1. మీకు తరచుగా జ్వరం, జలుబు ఉంటే ముందుగా పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో ఎక్కడా నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేసే దోమల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

2. ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా శరీరంలో రోగాలు వస్తాయి. కాబట్టి మారుతున్న కాలంలో ఇటువంటి ఆహారాలను తినకుండా ఉండండి. ఎందుకంటే ఇది వైరల్ ఫీవర్‌కి కారణమవుతుంది.

3. వైరల్ ఫీవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే తులసి, దాల్చిన చెక్కలను నీటిలో వేసి మరిగించి తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. జ్వరం పునరావృతం కాకుండా చేస్తుంది.

4. వాము చాలా ప్రయోజనకరమైన మసాలా. జలుబు, జ్వరం నుండి ఉపశమనం పొందడానికి మీరు వాము తినవచ్చు. వైరల్ ఫీవర్‌లో వాము చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మీరు నీటిని మరిగించి తాగడానికి ప్రయత్నిస్తే ప్రయోజనం కలుగుతుంది.

(గమనిక:  ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు. )

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..