Visakha Tour: మన్యంలో పర్యాటకుల సందడి.. వంజంగి కొండపై మంచు అందాలు పర్యాటకులకు కనువిందు
Visakha Tour: విశాఖ జిల్లా ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో...
Visakha Tour: విశాఖ జిల్లా ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. మన్యం అందాలను చూసేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. ఏజెన్సీలోని మేఘాల కొండగా పేరు పొందిన పాడేరు మండలం వంజంగి కొండపై పర్యాటకుల తాకిడి నెలకొంది. పొగమంచు కురుస్తుండడంతో గిరి శిఖరాలను తాకుతూ అలుముకున్న దట్టమైన పొగమంచు అందాలను వీక్షించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు.. వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు చేరుకుంటున్నారు. తెల్లవారు జామున కురిసే దట్టమైన మంచుకి గిరి శిఖరాలు పాల సముద్రాన్ని తలపింస్తున్నాయి.
దీంతో వంజంగి హిల్స్‌లోని మేఘాల కొండకు చేరుకుని పర్యాటకులు మంచు అందాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు. సూర్యోదయం వేళ అక్కడి ప్రకృతి అందాలకు వారంతా ఫిదా అవుతూ సేల్ఫీలతో సందడి చేస్తున్నారు.పచ్చని కొండల మధ్య తేలియాడే పాల సముద్రం లాంటి మేఘాల సమూహాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు. ఓ పక్కన పచ్చని చెట్లు. అంబరాన్ని తకుతున్నట్లుందే గిరి శిఖరాలు.. ఆ కొండలు మధ్య మధ్యలో తేలియాడుతున్న మేఘాలు.. ఉషోదయం వేళ చల్ల గాలి చలి.. ఆహ్లాదం కలిగించే వాతావరణం మరింత అద్భుతంగా ఉందని.. పర్యాటకులు చెబుతున్నారు. పాడేరు ఘాట్‌లోని మోదకొండమ్మ తల్లి పాదాలు గుడి ప్రాంతం, కాఫీ తోటలు, మత్స్యగుండం, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాలు, చింతపల్లి మండలంలోని లంబసింగి పర్యాటక ప్రాంతం, తాజంగి రిజర్వాయర్ వద్ద కూడా పర్యాటకుల సందడి నెలకొంది
Also Read: అమలాపురంలో రోజూ మార్నింగ్ జాగింగ్ చేస్తున్న శునకం.. ఏకంగా 25 రౌండ్లు రన్నింగ్