Rajasthan: రాజస్థాన్ అంటే కోటలే కాదు.. అద్భుతమైన సరస్సులు కూడా.. వీటిని తప్పక సందర్శించండి

మీకు ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం అయితే తప్పనిసరిగా మీ బకెట్ జాబితాలో రాజస్తాన్ ఉండాలి. ఈ ప్రదేశంలోని అందమైన కోటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. రాజస్థాన్ లోని కోటలు మాత్రమే కాదు.. రాజుల కోటలతో పాటు.. అక్కడ సందర్శించడానికి ఇంకా చాలా ఉన్నాయి. రాజస్తాన్ లోని అందమైన మనశ్శాంతిని ఇచ్చే సరస్సుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Rajasthan: రాజస్థాన్ అంటే కోటలే కాదు.. అద్భుతమైన సరస్సులు కూడా.. వీటిని తప్పక సందర్శించండి
Beautiful Lakes In Rajasthan

Updated on: May 04, 2025 | 7:51 PM

భారతదేశంలోని రాజస్థాన్ ఏడాది ప్రదేశం.. అంతేకాదు ఇది రాజపుత్రులు ఏలిన “రాజుల భూమి”. రాజస్థాన్‌ను అనేక రాజవంశాలు, రాజులు పరిపాలించారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్, ఉదయపూర్ వంటి ప్రసిద్ధ నగరాలు ఈ ప్రాంత రాచరిక వారసత్వం, నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ ప్రదేశం సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే అనేక రాజభవనాలు, కోటలు ఇక్కడ ఉన్నాయి. రాజధాని జైపూర్‌లో కూడా చాలా అందమైన కోటలు ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత ఎవరి మనసు అయినా ఆనందంతో నిండిపోతుంది. రాజస్థాన్‌లో సందర్శించడానికి కోటలు, రాజభవనాలు మాత్రమే కాదు అక్కడ సహజ సౌందర్యం మధ్య కూడా సమయం గడపవచ్చు. రాజస్థాన్‌లో అందమైన సరస్సులు ఉన్న ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

రాజస్థాన్‌లో.. ఇప్పటికీ పాత సంప్రదాయాలను అనుసరించే వ్యక్తులు కనిపిస్తారు. ఇక్కడి ప్రజలు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. రాజస్థాన్ కళలు, సాంస్కృతిక నృత్యాలు, పాటలతో పాటు రుచికరమైన ఆహారంతో ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశానికి వెళ్ళిన వారు అక్కడ ఉన్న అందాన్ని చూసి ప్రేమలో పడతారు.

ప్రతి పర్యాటకుడు సందర్శించాల్సిన రాజస్థాన్‌లోని 5 సరస్సులు

రాజస్థాన్ లోని పిచోలి అందమైన సరస్సు మీ మనసులో ముద్రను వేసుకుంటుంది. ఇక్కడ ప్రవహించే నీటి దగ్గర కూర్చుని పర్వతాలు, రాజభవనం, ఘాట్ చూడటం మీ మనసును దోచుకుంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. ఇది జీవితంలో అత్యుత్తమ అనుభవాలలో ఒకటి అవుతుంది.

ఇవి కూడా చదవండి

అనసాగర్ సరస్సు, అజ్మీర్
రాజస్థాన్ సందర్శించాలనుకుంటే జైపూర్ కోటను సందర్శించడంతో పాటు అక్కడ ఉన్న అనా సాగర్ సరస్సును కూడా సందర్శించాలి. ఇది అన్ని వైపులా ఆరావళి కొండలతో చుట్టుముట్టబడి ఉంది. ఇక్కడ రణగొణధ్వనుల నుంచి విశ్రాంతి లభిస్తుంది.

గడిసర్ సరస్సు, జైసల్మేర్
జైసల్మేర్ చాలా అందమైన ప్రదేశం. అయితే ఇక్కడ రాజస్థాన్ కు చెందిన ఒక పురాతన సరస్సు ఉందని మీకు తెలుసా. ఈ సరస్సు జైసల్మేర్ కోట నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పుష్కర్ సరస్సు, పుష్కర్
పుష్కర్ సరస్సు రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలోని పుష్కర్ పట్టణంలో ఉంది. ఇక్కడ గంగా నది ఒడ్డున కూర్చున్నట్లు మీకు అనిపిస్తుంది. ఎందుకంటే దాని వెనుక పురాతన కథ దాగి ఉంది. ఈ సరస్సు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హిందువుల నమ్మకం ప్రకారం ఇది ఒక తీర్థయాత్ర స్థలం.

నవల్ సాగర్ సరస్సు, బుండి
నవల్ సాగర్ సరస్సు భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి నగరంలో ఉంది. ఈ సరస్సు అత్యంత ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ఈ సరస్సు చుట్టూ వివిధ మెట్ల బావులు ఉన్నాయి. ఈ సరస్సు మధ్యలో ఆర్యుల జల దేవుడు వరుణుడి ఆలయం ఉంది. వరుణుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.

ఇప్పటివరకు మీకు రాజస్థాన్‌ అంటే రాజభవనాలు, కోటలు మాత్రమే అని తెలిసి ఉండవచ్చు. అయితే రాజస్థాన్ పర్యటనను మరింత అందంగా చేసుకునేందుకు తప్పకుండ ఈ అందమైన సరస్సులను సందర్శించండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..