Telangana tourism: వీకెండ్ టూర్‌.. హైదరాబాదీలకు బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. పూర్తి వివరాలు

|

May 14, 2024 | 7:43 AM

ప్రస్తుతం పిల్లలకు సమ్మర్‌ హాలీడేస్‌ ఇచ్చేశారు. దీంతో చాలా మంది టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఉద్యోగాల రీత్యా చాలా మంది ఎక్కువ రోజులు సమయం కేటాయించలేని పరిస్థితి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజులోనే ముగిసేలా ఈ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.?

Telangana tourism: వీకెండ్ టూర్‌.. హైదరాబాదీలకు బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌. పూర్తి వివరాలు
Telangana Tourism
Follow us on

ప్రస్తుతం పిల్లలకు సమ్మర్‌ హాలీడేస్‌ ఇచ్చేశారు. దీంతో చాలా మంది టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అయితే ఉద్యోగాల రీత్యా చాలా మంది ఎక్కువ రోజులు సమయం కేటాయించలేని పరిస్థితి. అలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం ఒక మంచి టూర్‌ ప్యాకేజీని తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజులోనే ముగిసేలా ఈ టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధరలు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతీ శనివారం ఈ టూర్‌ను ఆపరేట్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌-కొండపోచమ్మ-వేములవాడ-కొండగట్టు-హైదరాబాద్‌ పేరుతో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఏసీ మినీ బస్‌లో ప్రయాణం ఉంటుంది. ధర విషయానికొస్తే పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 1799 కాగా చిన్నారులకు రూ. 1439గా నిర్ణయించారు. దర్శనం, ఎంట్రీ టికెట్స్‌, ఫుడ్‌ ప్యాకేజీలో కవర్‌ అవ్వవు. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం 6 గంటలకు బషీర్‌ బాగ్‌లోని సీఆర్‌ఓ కార్యాలయం నుంచి బస్సు బయలుదేరుతుంది.

* 9 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకుంటారు. మార్గమధ్యలోనే బ్రేక్‌ ఫాస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

* ఉదయం 10 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి బయలుదేరుతారు.

* అనంతరం 11 గంటలకు కొమరవెళ్లి చేరుకొని. అక్కడ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

* దర్శనం చేసుకున్న తర్వాత వేములవాడ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడు చేరకుంటారు.

* మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు దర్శనం లంచ్‌ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతారు.

* సాయంత్రం 5 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. 6 గంటల వరకు దర్శనం ముగించుకుంటారు.

* అనంతరం తిరిగి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం మొదలై రాత్రి 10 గంటలకు చేరుకుంటారు.

టూర్‌ను బుక్‌ చేసుకోవడం కోసం, పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..