Summer Travel Tips: మనదేశంలో అత్యంత శీతల ప్రదేశాలు ఇవే.. వేసవిలో వెళ్ళినా చలికి దుప్పటి కప్పుకోవాల్సిందే..

వేసవి కాలం వచ్చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే తీవ్రమైన వేడి ఉంది. మరోవైపు వేసవి సెలవులు కూడా వచ్చేస్తున్నాయి దీంతో చాలా మంది చల్లని ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి ప్రదేశాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. మన దేశంలో వేసవిలో చల్లదనం ఉండే అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

Summer Travel Tips: మనదేశంలో అత్యంత శీతల ప్రదేశాలు ఇవే.. వేసవిలో వెళ్ళినా చలికి దుప్పటి కప్పుకోవాల్సిందే..
Summer Travel Tips

Updated on: Apr 19, 2025 | 10:44 AM

వాతావరణం ఏదైనా.. చాలా మంది ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. ఇది ఏప్రిల్ నెల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు చల్లని ప్రదేశాలను సందర్శించాలకు వెళ్ళాలని.. సరదాగా గడపాలని కోరుకుంటారు. చల్లని ప్రదేశాన్ని సందర్శించాలీ అని ఆలోచన రాగానే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కాశ్మీర్, లేహ్-లడఖ్ లోని అందమైన ప్రదేశాలను గుర్తు చేసుకుంటారు. ఇక్కడకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ రోజు మనం వేసవిలో చల్లదనం ఇచ్చే అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

చల్లని గాలి, మంచుతో కప్పబడిన శిఖరాలు, అందమైన లోయలు, దట్టమైన పచ్చని అడవులు ఉన్న అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మీరు కూడా అలాంటి ప్రదేశానికి వెళ్లాలని ఆలోచిస్తుంటే.. ఈ రోజు అటువంటి ప్రదేశాలను పరిచయడం చేస్తున్నాం. ఈ ప్రదేశాలలో వేసవి ని మరచి మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో చిరస్మరణీయ క్షణాలను గడపవచ్చు.

రెకాంగ్ పియో: హిమాచల్‌లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి రెకాంగ్ పియోను సందర్శించండి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 7 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. ఇది అందమైన, ప్రశాంతమైన హిల్ స్టేషన్. ఇక్కడ చేరుకున్న వెంటనే మనసు ప్రశాంతం అయిపోతుంది. మీరు ఇక్కడ అనేక సాహస కార్యకలాపాలు కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మున్సియరి: మీరు ఉత్తరాఖండ్ సందర్శించాలనుకుంటే.. ఇక్కడ ఉన్న అందమైన మున్సియారి హిల్ స్టేషన్‌ను ఒకసారి సందర్శించండి. ఎందుకంటే ఇది ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, సరస్సులు, జలపాతాలతో కూడిన అందమైన హిల్ స్టేషన్. చల్లని గాలిని, అందమైన లోయలను ఆస్వాదించగల ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్ జిల్లాలో ఉన్న ఒక చిన్న కొండ ప్రాంతం.

సోనామార్గ్: జమ్మూ కాశ్మీర్‌లో మీరు సందర్శించే ఏ ప్రదేశమైనా స్వర్గంలా కనిపిస్తుంది. అందుకే దీనిని భూతల స్వర్గం అని పిలుస్తారు. ఇక్కడ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది, ఇది మాత్రమే కాదు ఇక్కడ ఎల్లప్పుడూ మంచు , చల్లని గాలులను ఆస్వాదించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌లోని సోనామార్గ్ కొండ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకుంటారు. వేసవి కాలంలో కూడా ఈ ప్రాంత ఉష్ణోగ్రత 10°C నుంచి 20°C మధ్య ఉంటుంది. దీనిని హనీమూన్ కి గమ్యస్థానంగా కూడా పిలుస్తారు.

లేహ్ లడఖ్: దేశంలో సందర్శించదగిన ప్రదేశాలలో లేహ్ లడఖ్ అగ్రస్థానంలో ఉంది. మీరు ఇక్కడికి ఏ సీజన్ లో వెళ్ళినా రోజులో ఏ సమయంలో వెళ్ళినా ఎప్పుడూ చాలా చల్లగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ ప్రాంతంలో విహారయాత్ర మాత్రమే కాదు సాహస ప్రియులకు అనేక సాహస క్రీడలు కూడా ఉన్నాయి.

సిక్కిం: వేసవిలో సిక్కింను కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. వేసవిలో ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఉత్తమ ఎంపిక. ఈ ప్రదేశం స్వర్గం కంటే తక్కువ కాదు. దేశంలో ఏ ప్రాంతం నుంచి ఈ ప్రదేశానికి వెళ్ళినా ఇక్కడ అడుగు పెట్టగానే వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్లు అనిపిస్తుంది.

షిల్లాంగ్: మేఘాలయలోని అందమైన ప్రదేశమైన షిల్లాంగ్. ఇక్కడ వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. షిల్లాంగ్‌ను తూర్పు స్కాట్లాండ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు సందర్శించడానికి ఇష్టపడే ప్రదేశాలలో ఇది ఒకటి.

ఊటీ: ఉదకమండలం అని పిలిచే ఊటీ వాతావరణం కూడా చాలా బాగుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు. వేడి నుంచి ఉపశమనం పొందాలనుకుంటే ఊటీలోని అందమైన లోయలను సందర్శించండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..