Summer Travel Tips: సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక

|

Mar 17, 2025 | 8:59 AM

వేసవి కాలం వచ్చేసింది. వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించడానికి ప్రణాళికలను వేస్తారు. ఏప్రిల్‌ వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సమయం. కనుక మీరు మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకుంటున్నారా... ఉరుకుల పరుగుల జీవితానికి, జనసమూహానికి దూరంగా.. ఎక్కడికైనా వెళ్లి ప్రశాంతంగా కొన్ని రోజులైనా జీవితాన్ని గడపాలనుకుంటున్నారా.. ఏప్రిల్ లో ఈ ప్రదేశాల్లో పర్యటించడం బెస్ట్ ఎంపిక..

Summer Travel Tips: సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక
Summer Travel Tips
Follow us on

ఏప్రిల్ నెల కొత్త ప్రదేశాల్లో పర్యటించడానికి, వివిధ ప్రాంతాలను సందర్శించడానికి ఉత్తమ సమయం. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం బాగుంటుంది. దీని తరువాత వాతావరణంలో పరిస్థితుల్లో మార్పులు రావడం ప్రారంభంమవుతాయి. కనుక కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే ఏప్రిల్ నెలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నగర జీవితానికి, హడావిడికి దూరంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఈ అందమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడ రోజువారీ పనులకు దూరంగా ప్రకృతి మధ్య సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

ఔలి
మీరు వేసవి ఎండల నుంచి ఉపశమనం కోసం ఏప్రిల్‌లో చల్లని ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ఔలికి వెళ్లవచ్చు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ఇది చాలా అందమైన హిల్ స్టేషన్. మేఘాలతో కప్పబడిన పర్వతాలు, సరస్సులు, జలపాతాలు, దట్టమైన అడవులు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. ఏప్రిల్‌లో ఇక్కడ ఉష్ణోగ్రత 10°C నుంచి 20°C వరకు ఉంటుంది. ఇక్కడ మీరు నందా దేవి శిఖరం, ఔలి సరస్సు, గుర్సో బుగ్యల్, త్రిశూల్ శిఖరం, నందా శిఖరం వంటి అనేక అందమైన ప్రదేశాలను అన్వేషించవచ్చు. మీరు మీ భాగస్వామి లేదా స్నేహితులతో ఇక్కడ సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

మౌంట్ అబూ
రాజస్థాన్ సమీపంలో ఉన్న మౌంట్ అబూ సందర్శించడానికి చాలా మంచి ఎంపిక. ఇది ఆరావళి కొండలలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ మీరు ఫ్యామిలీతో లేదా స్నేహితులతో సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పర్వతం చుట్టూ దట్టమైన అడవి ఉంది. దీనివల్ల మౌంట్ అబూ అందం రెట్టింపు అవుతుంది. ఇక్కడ మీరు దిల్వారా జైన్, రెడ్ టెంపుల్ సందర్శించవచ్చు. దీనితో పాటు గురు శిఖర్, నక్కి సరస్సు, అచల్‌గఢ్ కోట, మౌంట్ అబు వన్యప్రాణుల అభయారణ్యం, టోడ్ రాక్, పీస్ పార్క్, చాచా మ్యూజియం, ట్రెవర్ ట్యాంక్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఊటీ
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉన్న ఊటీ చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్. ఇక్కడి ప్రకృతి అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఊటీ సరస్సు, దొడ్డబెట్ట శిఖరం, నీలగిరి పర్వత రైల్వే , బొటానికల్ గార్డెన్ వంటి ప్రదేశాలను అన్వేషించవచ్చు. నీలగిరిలోని ఎత్తైన దొడ్డబెట్ట శిఖరం నుంచి కనిపించే దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భవానీ సరస్సు తక్కువ రద్దీతో ఉండే ప్రశాంతమైన ప్రదేశం. అవలాంచె సరస్సు, ఎమరాల్డ్ సరస్సు, భవానీ ఆలయం దారిలో వస్తాయి. ఇక్కడికి చేరుకోవడానికి మార్గం దట్టమైన అడవి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..