Son Bhandar Caves: ట్రెజర్ హంట్(treasure hunt) సినిమాల్లో చూస్తాం.. పుస్తకాల్లో చదువుతాం..అయితే భారత దేశం (India) కొన్ని వందల వేళ్ళ క్రితం సంపన్న దేశమని చరిత్రకారుల కథనం. పూర్వ కాలంలో మనదేశాన్ని పాలించే రాజులు అత్యధిక సంపన్నులను.. వజ్ర, వైడుర్యాలను వీధుల్లో రాశులుగా పోసి అమ్మేవారని.. అందుకనే అప్పట్లో స్వర్ణయుగంగా పిలిచేవారని చరిత్రలో చదువుకున్నాం..అంతేకాదు..రాజులు తమ వద్ధ ఉన్న వజ్రవైఢ్యూర్యాలు, బంగారు వెండి తో కూడిన విలువైన నగలు, ధనం.. తమ శత్రువుల చేతికి చిక్కకుండా.. తమ వారసులకు చెందాలని రహస్య ప్రదేశాల్లో దాచేవారని టాక్.. ఆ నిధి రహస్యాన్ని తెలిపేలా.. చిత్ర రూపంలో.. వింత లిపిలో.. పత్ర నమూనాలో పొందుపరుస్తారు. నక్షలు వేయించి భావితరలకు ఆ నిధిని చేరుకోవడానికి మార్గం ఏర్పరిచేవారు. అలాంటి నిధి నిక్షేపలు మన భారత దేశంలో ఎన్నో బయటపడ్డాయి.. కొన్నింటి నిధి రహస్యాలు తెలిసినా.. కొన్ని చోట్ల నిధి ఉన్న ప్లేస్.. అందులో ఉన్న నిధి వివరాలు తెలిసినా.. నిధిదగ్గరకి చేరే మార్గం లేక గోప్యంగా మిగిలి పోయాయి. ఆలంటి రహస్య నిధి ఒకటి బీహార్ రాష్ట్రంలో గురించి మనం తెలుసుకొందాం..!
మన దేశాన్ని ఏలిన రాజుల్లో మగధ రాజు బింబసారుడు ఒకరు.. ఇతని వయసు మళ్లిన అనంతరం మగధ సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కాగా బింబిసారుడు కొడుకుల్లో ఒకడైన అజాత శత్రువు బలవంతుడు.. దీంతో తన సోదరులను ఓడించి తన తండ్రి బింబసారుడి ని సోన్ బందర్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్టించాడు. కాగా తన తనయుడు దుర్మార్గాన్ని ముందుగా కనిపెట్టిన బింబసారుడు తన వద్ద ఉన్న అమూల్యమైన ధన వస్తు సంపద, వజ్ర వైడ్యూర్య తో కూడిన విలువైన సంపదను రాజ్‌గిర్‌లోని గుహలో దాచి ఉంచాడట.. ఈ విషయం తెలుసుకొన్న అజాత శత్రువు ఆ గుహలోకి వెళ్ళే మార్గం చెప్పమని.. తన తండ్రిని ఎన్నో కష్టాలు పెట్టాడట.. కానీ బింబసారుడు నిధి కోసం గుహ లోకి వెళ్ళే మార్గాన్ని చెప్పలేదు.. కొంత కాలానికి మరణించాడు.. తండ్రి మరణంతో నిధి రహస్యం తెలియక అజాత శత్రువు నిరాశతో క్రుంగి పిచ్చి వాడు అయ్యాడట.. ఆ సమయంలో మగధ కు వచ్చిన కొంత మంది బౌద్ధ బిక్షువులు వచ్చి అజాత శత్రువు కి పట్టిన పిచ్చి తగ్గించారట. అనంతరం అజాత శత్రువు బౌద్ధ మతం స్వీకరించి ఆ నిధి విషయం మరచి పోయాడని అంటారు.
సోన్ భండార్ గుహలోకి వెళ్లిన వెంటనే నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. అనంతరం నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. అక్కడ ఒక తలుపు.. దానిని తెరవడానికి వీలు లేనివిధంగా ఒక్క భారీ రాయి అడ్డుగా ఉంది. ఆ రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని.. గుహలోకి వెళ్ళే దారిని బింబసారుడు తాను మరణించడానికి ముందు ఎవరికీ అర్ధం కానీ విధంగా ఇలా లిపిలో చెక్కించి నట్లు అక్కడ శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఈ లిపిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చట. ఇప్పటికే ఈ నిధిని దక్కించుకోవడానికి మనదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు చాలా ప్రయత్నాలు చేశారు. తలుపుని, రాయిని పగలగొట్టడానికి ఏకంగా ఫిరంగిని కూడా ఉపయోగించారు. అయినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఈ సోనా భండారు గుహలను ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ నిధి రహస్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి..గుహలోని నిధి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ సోన్ భండార్ ఇప్పటికీ చేధించలేని ప్రపంచానికి ఒక రహస్యంగానే మిగిలింది.
Also Read: