
RAMESHWARAM ONE DAY TRIP (SMH109): దక్షిణ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో రామేశ్వరం ఒకటి. ఇక్కడ వెలసిన శ్రీ రామనాథస్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రామాయణంతో ముడిపడి ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని శైవులు, వైష్ణవులు సమానంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం ‘కాశీ యాత్ర చేసిన వారు రామేశ్వరం దర్శనం చేసుకుంటేనే యాత్ర సంపూర్ణమవుతుందని’ విశ్వాసం. అందుకే రామేశ్వరాన్ని దక్షిణ కాశీ లేదా బెనారస్ ఆఫ్ ది సౌత్ అని కూడా పిలుస్తారు. ఆధ్యాత్మికతతో పాటు సముద్ర తీర అందాలు, చారిత్రక ప్రదేశాలను ఒకే రోజులో సందర్శించాలనుకునే భక్తులకు ఈ ‘రామేశ్వరం వన్‌డే టూర్ ప్యాకేజీ’ మంచి ఎంపికగా ఉంటుంది.
ఈ యాత్ర ఉదయం 6 గంటలకు మదురై నుంచి ప్రారంభమవుతుంది. సుమారు ఉదయం 9:30 గంటలకు రామేశ్వరం చేరుకుంటారు. మార్గమధ్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాంబన్ బ్రిడ్జ్ (ఇందిరా గాంధీ రోడ్ బ్రిడ్జ్) అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. సముద్రంపై నిర్మించిన ఈ వంతెన ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. రామేశ్వరం చేరుకున్న తర్వాత ముందుగా అగ్ని తీర్థంలో పవిత్ర స్నానం చేయవచ్చు. అనంతరం శ్రీ రామనాథస్వామి జ్యోతిర్లింగ ఆలయంలో స్వామివారి దర్శనం ఉంటుంది.
మధ్యాహ్న భోజనం అనంతరం ఈ ప్రదేశాలను సందర్శిస్తారు:
సాయంత్రం తిరుగు ప్రయాణం ప్రారంభమై రాత్రి 10 గంటలకు మదురై చేరుకుంటారు.
ఒకే రోజులో రామనాథస్వామి జ్యోతిర్లింగ దర్శనం, అగ్ని తీర్థ స్నానం, పాంబన్ బ్రిడ్జ్ సందర్శనం, ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ వంటి ప్రముఖ ప్రదేశాలను సౌకర్యవంతంగా దర్శించుకునే అవకాశం ఈ ప్యాకేజీ ద్వారా లభిస్తుంది. కుటుంబ సభ్యులు, భక్తులు, సీనియర్ సిటిజన్లకు కూడా ఇది అనుకూలమైన ఆధ్యాత్మిక యాత్రగా చెప్పవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.