AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ఆధ్యాత్మిక గురువు భగవాన్ రమణ మహర్షి (Bhagavan Ramana Maharshi) బోధనలు నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆత్మవిచారణ, మనశ్శాంతి, మౌనం, ధ్యానం వంటి అంశాలపై ఆయన చెప్పిన సందేశాలు జీవితాన్ని సానుకూల దిశగా నడిపించే మార్గదర్శకాలుగా నిలిచాయి. "నేను ఎవరు?" అనే ఆత్మజ్ఞాన మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రమణ మహర్షి సూక్తులు ప్రతి ఒక్కరికీ ఆలోచింపజేసే అమూల్యమైన జీవన పాఠాలను అందిస్తాయి.

ఆనందం + మనశ్శాంతికి కేరాఫ్ ఆదే..! రమణ మహర్షి ఆధ్యాత్మిక సందేశం
Bhagavan Ramana Maharshi Spirtual TeachingsImage Credit source: AI
Janardhan Veluru
|

Updated on: Jul 30, 2026 | 7:00 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత దేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖుల్లో భగవాన్ రమణ మహర్షి కూడా ఒకరు. 1879 డిసెంబర్ 30న తమిళనాడులో జన్మించిన ఆయన.. 16 ఏళ్ల వయస్సులో లోతైన ఆధ్యాత్మిక అనుభూతి పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతం వద్ద స్థిరపడి జీవితాంతం ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానానికి మార్గదర్శిగా నిలిచే భగవాన్ బోధనలు (Ramana Maharshi Spiritual Teachings) ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన చెప్పిన ఆధ్యాత్మిక సందేశాలు మనశ్శాంతి, ఆత్మపరిశీలన, ధ్యానం, మౌనం వంటి అంశాలకు కొత్త అర్థాన్ని తెలియజేస్తాయి.

రమణ మహర్షి చెప్పిన ఆధ్యాత్మిక సూక్తులు

  • మనసును గమనించండి: శ్వాసను ఏకాగ్రతతో గమనిస్తే మనస్సు క్రమంగా ప్రశాంతమవుతుంది. శ్వాస, మనస్సు ఒకే శక్తికి రెండు రూపాలని రమణ మహర్షి వివరించారు.
  • మౌనం విలువ: మౌనం కూడా ఒక గొప్ప ఉపదేశమని, మాటల కంటే మౌనమే సత్యాన్ని ఎక్కువగా తెలియజేస్తుందని విశ్వసించారు.
  • నిజమైన మౌనం అంటే?: కేవలం నోరు మూసుకోవడం మౌనం కాదు. మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఆలోచనల అలజడి తగ్గినప్పుడే నిజమైన మౌనం సిద్ధిస్తుంది.
  • నిజమైన ఆనందం ఎక్కడ?: నిజమైన ఆనందం బయట ప్రపంచంలో కాకుండా మన అంతరంగంలోనే ఉంటుందని చెప్పారు.
  • జీవిత పరమార్థం ఏంటి..?: అహంకారాన్ని అధిగమించి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే జీవిత పరమార్థమని బోధించారు.
  • దేవుడు ఎక్కడ ఉన్నాడు?: దేవుణ్ని బయట కాకుండా మన అంతరంగంలో వెతికితే దైవానుగ్రహం స్వయంగా లభిస్తుంది. చెడు పనులకు దూరంగా ఉండి, అనవసర భారాలను మోసుకోకుండా జీవించాలని ఆయన ఉపదేశించారు.
  • మనశ్శాంతి కావాలా?: ధ్యానం యొక్క పరమ లక్ష్యం ఆత్మను తెలుసుకోవడమే. ప్రతి వ్యక్తి తన మానసిక పరిపక్వతకు అనుగుణంగా ధ్యాన విధానాన్ని ఎంచుకోవచ్చని రమణ మహర్షి చెప్పారు. ధ్యానం, ఆత్మపరిశీలన, వైరాగ్యం ద్వారా మనశ్శాంతి సాధ్యమని వివరించారు.
  • ‘నేను ఎవరు?’ అనే ప్రశ్న: రమణ మహర్షి బోధనల సారాంశం ఆత్మ విచారణ. “నేను ఎవరు?” అనే ప్రశ్నకు అంతరంగంలో సమాధానం వెతకడమే నిజమైన యోగం, తపస్సు అని ఆయన బోధించారు.
  • ఆనందం కావాలా?: ఆనందం బయట నుంచి రాదు; అది మీ సహజ స్వభావం.
  • మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యం అనుభవంలోకి వస్తుంది.
  • నిజమైన గురువు మన అంతరంగంలోని ఆత్మే.

రమణ మహర్షి సందేశం

మనశ్శాంతి కోసం బయటి ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం కంటే, మనలోని ఆలోచనలను పరిశీలించి ఆత్మను తెలుసుకోవడమే నిజమైన విముక్తి మార్గమని భగవాన్ రమణ మహర్షి తన జీవితమంతా బోధించారు. ఆయన ఆత్మవిచారణ సిద్ధాంతం నేటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సాధకులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. రమణ మహర్షి బోధనలు నేటికీ మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

Follow Us