Death Mystery Village: పుట్టిన జీవికి మరణం తప్పదు.. అసలు మరణించినవారు లేని కుటుంబం లేదు.. వెనుక ముందు అందరం భూమి మీద మన పాత్ర ముగిసిన తర్వాత నిష్క్రమించాల్సిందే.. ఇది సనాతన ధర్మంలో నమ్మకం . శ్రీకృష్ణుడు అర్జుడికి చెప్పిన మనిషి జీవన ప్రయాణం.. అయితే ఈ ఊర్లో మాత్రం ఓ వింత గత కొన్ని వందల ఏళ్లుగా సాగుతూనే ఉందట.. అదేమిటంటే.. ఆ ఊరిలో జన్మించేవారికంటే.. మరణించేవారు ఎక్కువ.. అంతేకాదు అక్కడ ఒకరు మరణిస్తే.. వెంటనే మరొకరు వెంటనే చనిపోతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వందల సంవత్సరాలుగా సాగుతూనే ఉందట. ఇందులో రహస్యం.. చావుల మర్మం ఎవరికీ అంతుచిక్కడం లేదు.. అసలు తమ గ్రామంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో ఆ గ్రామస్థులకు అంతుబట్టడం లేదు.. దీంతో ఊరికి శాంతులు పూజలు చేయించారు. అయినా మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. మీరు చావుల మిస్టరీ గ్రామంలో ఎక్కడ ఉందో తెలుసా.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో.. వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని నెన్నెల గ్రామంలో గ్రామస్థులకు తెల్లావారుతుందంటే భయం.. ఎవరి ఇంట్లో చావు కబురు వినిపిస్తుందో.. ఎవరికీ మృత్యువు దరిచేరుతుందో తెలియని పరిస్థితి.. దీంతో అక్కడ నివసించే వారు కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదు. శతాబ్దాలుగా ఆ గ్రామంలో మృత్యుఘోష మ్రోగుతూనే ఉంది. ఊళ్లో ఒకరు చనిపోతే ఆ వెంటనే మరొకరు చనిపోవడం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఇక్కడ చావులకు కారణం ఏమిటో తెలియదు.
అయితే నెన్నెల గ్రామానికి 500 ఏళ్ల చరిత్ర ఉందంటున్నారు. తాత ముత్తాతల నుంచీ జంట చావుల ఆనవాయితీ నడుస్తోంది. తమ ఊరిలో చావుల రహస్యం వెనుక అసలు కారణం ఏమిటో అంతు పట్టటం లేదని ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో చాలామంది హేతువాదులు ఈ గ్రామస్థులది మూఢనమ్మకం అన్నారు. ఒక ఇంట్లో వరస చావులు అపోహ అంటూ కొట్టిపారేశారు. వరుస మరణాలు కొనసాగడం.. సాక్ష్యాలూ ఆధారాలు ఉండటంతో హేతువాదులు సైతం ఇప్పుడు ఈ గ్రామంలోని రహస్యాన్ని చేధించడానికి ముందుకు రావడం లేదు.
అయితే గ్రామస్థులు చావులకు అడ్డుకట్టవేయడానికి చేయని ప్రయత్నం లేదు. ఊరికి గ్రహశాంతులను చేయించారు. బలి కూడా ఇచ్చారు. వాస్తుపరంగా ఏమైనా దోషాలు ఉన్నాయో నిపుణులకు చూపించారు. వేద పండితులతో అనేక పూజా కార్యాక్రమాలు నిర్వహించారు. ఎన్నో చేసిన ఆ ఊరికి పట్టిన మహమ్మారి ఏంటో తెలియదు.. మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ఊరందరికీ మృత్యుభయమే.. ఈ భయంతోనే కొన్ని సార్లు జంట మరణాల నుంచి నలుగురి వరకూ కూడా మరణిస్తున్నారు. గత కొన్ని వందల తరాలుగా వస్తున్న ఈ వరస జంట మరణాలపై ఒక్కొక్కరూ ఒక్కో కథనం వినిపిస్తున్నారు. ముఖ్యంగా మృతుల అంత్యక్రియలు గ్రామలో పడమర దిక్క చేస్తున్నారని.. అదే తూర్పు దిక్కుకు చేస్తే.. జంట మరణాలు ఉండవని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ ఒళ్ళో జంట చావులు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు.. అంతేకాదు.. ఊరిలోని యువకులకు తమ పిల్లలను ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. ఏళ్లతరబడి కొనసాగుతున్నాయి డెత్ మిస్టరీ.. ఇప్పటికీ కనిపెట్టలేని మిస్టరీనే.
Also Read: తెలంగాణాలో మరో కంపెనీ భారీ పెట్టుబడి.. 22వేల ఉద్యోగాలు, 3లక్షల ఎకరాల్లో పత్తి కొనుగోలు చేసే అవకాశం..