వేసవిలో అందమైన ప్రకృతిలో ఒడిలో సేదదీరాలనుకుంటున్నారా.. అయితే ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన, ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన లేహ్-లడఖ్‌కు IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ పర్యటన ఆరు రాత్రులు, ఏడు పగళ్ల పాటు కొనసాగనుంది. ఈ ప్యాకేజీలో లడఖ్ లోని అందమైన దృశ్యాలు చూడవచ్చు. అంతేకాదు సాహసాలు ఇష్టపడేవారికి ట్రెక్కింగ్ , సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస క్రీడల వరకు అనేక రకాల కార్యకలాపాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వివరాల్లోకి వెళ్తే..
IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీ మే 4న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుంటుంది. ముందుగా ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకోవాలి. ఇక్కడ నుంచి లేహ్‌కు వెళ్లే విమానంలో పర్యటన ప్రారంభమవుతుంది. లెహ్ కు చేరుకున్న తర్వాత.. ప్రయాణీకులు హోటల్‌లో బస చేస్తారు. ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత అందమైన ఎత్తైన ప్రదేశాలు, ప్రకృతికి అలవాటు పడటానికి సమయం ఉంటుంది.
లేహ్ లోని చుట్టూ ఉన్న పర్వతాలు, లోయలలోని అందమైన దృశ్యాలు, అందమైన తెల్లని గోపురం గల బౌద్ధ స్థూపం, శాంతి స్థూపాన్ని సందర్శించడంతో పర్యటన ఉత్సాహంగా ప్రారంభమవుతుంది.
ఈ పర్యటనలో భాగంగా లేహ్-లడఖ్ ప్రాంతంలోని పురాతన ఆశ్రమాలైన హేమిస్, థిక్సే, షేలతో సహా అనేక ఇతర అందమైన ప్రదేశాలను దర్శించవచ్చు. ఇవన్నీ అద్భుతమైన వాస్తుశిల్పం, సాంస్కృతిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందాయి.
నుబ్రా లోయ, పాంగోంగ్ సరస్సు , ఖర్దుంగ్లా పాస్‌ల సందర్శనలతో ఈ ప్రాంతం సహజ సౌందర్యాన్ని చూస్తూ.. ప్రకృతిని ఆస్వాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యాత్రికులు రివర్ రాఫ్టింగ్, ఒంటె రైడింగ్ , ATV రైడ్‌లు వంటి సాహస క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. వీటితో పాటు.. లేహ్-లడఖ్ చుట్టూ ఉన్న అందమైన లోయలు, పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయవచ్చు. టూర్ ప్యాకేజీలో అన్ని రిటర్న్ విమాన ఛార్జీలు, వసతి, భోజనం, సైట్ సీయింగ్ ధరలు అన్నీ కలిసి ఉన్నాయి.
టూర్ ప్యాకేజీ ధరలు:
టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కకి అయితే రూ. 54,500
ఇద్దరుకు టూర్ ప్యాకేజీ ధర: రూ. 47,830
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు టూర్ ప్యాకేజీని రూ. 45, 575
2 నుంచి 4 ఏళ్ల పిల్లలు కలవారికి టూర్ ప్యాకేజీ ధర రూ. 41,750