Karnataka: కర్నాటకలో ఈ 5 ఉత్తమ పర్యాటక ప్రాంతాలు..! చూస్తే మైమరిచిపోతారు..

|

Sep 20, 2021 | 3:50 PM

Karnataka Tourist Places: కర్నాటకలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే చాలు జీవితంలో అస్సలు మరిచిపోలేరు.

Karnataka: కర్నాటకలో ఈ 5 ఉత్తమ పర్యాటక ప్రాంతాలు..! చూస్తే మైమరిచిపోతారు..
Karnataka
Follow us on

Karnataka Tourist Places: కర్నాటకలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే చాలు జీవితంలో అస్సలు మరిచిపోలేరు. అందుకే ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా పర్యటిస్తారు. అందమైన బీచ్‌లు, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్, రుచికరమైన వంటకాలు, సుందరమైన దృశ్యాలు దర్శనమిస్తాయి. మీరు కర్ణాటకను సందర్శిస్తే మాత్రం కచ్చితంగా ఈ 5 ప్రదేశాలు చూసి తీరాల్సిందే. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. బెంగళూరు
కర్ణాటకలోని ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలలో బెంగుళూరు ఒకటి. ఇక్కడ ఆకర్షణీయమైన సరస్సులు, ఉద్యానవనాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ నగరాన్ని సందర్శించినప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. భారతీయ చరిత్ర, గొప్ప సంస్కృతి గురించి మీరు తెలుసుకుంటారు. పారాసైలింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, వన్యప్రాణి పర్యటన, వాటర్‌స్పోర్ట్‌లను ఆస్వాదించవచ్చు.

2. హంపి
తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం శిథిలమైన దేవాలయ శిధిలాలు, ఆనవాళ్లు ఉంటాయి. ఇది కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. మీకు చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రదేశం కచ్చితంగా సందర్శించాలి. ఇక్కడి కళాకారుల హస్తకళను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

3. బందీపూర్ నేషనల్ పార్క్
బందీపూర్ నేషనల్ పార్క్ చాలా సుందరమైన ప్రదేశం. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ఉద్యానవనంలో పచ్చదనాన్ని అనుభవించండి పక్షుల కిలకిలరావాలు వినండి. ప్రసిద్ధ టైగర్ రిజర్వ్, పక్షుల అభయారణ్యం తిలకించండి. అడవి ఏనుగు, గౌర్, జింక, మచ్చల జింక వంటి అరుదైన జంతువులను చూసి ఆనందించండి.

4. కూర్గ్
కర్ణాటకలోని ఈ హిల్ స్టేషన్‌లో చాలా ఆఫర్లు ఉన్నాయి. ప్రసిద్ధ కాఫీ తోటలు ఇక్కడి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అద్భుతమైన చరిత్ర, సహజ సౌందర్యం, రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. దగ్గరలో ఉన్న నదిని చూసి ఆనందించండి.

5. చిక్‌మగళూరు
దీనిని అధికారికంగా కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ ముల్లయనగిరి పర్వతాల దిగువన ఉంటుంది. ప్రశాంతమైన స్వభావం, పచ్చని అడవులు, యాగాచి నదికి ప్రసిద్ధి. కెమ్మగుండి, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, ముల్లాయనగిరి, హెబ్బే ఫాల్స్, బాబా బుడంగిరి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు.

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రిజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

Credit Score: క్రెడిట్‌ కార్డుల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..