IRCTC: సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే ఈ స్పెషల్‌ ప్యాకేజీ..

|

May 17, 2024 | 7:37 AM

వైజాగ్ రీట్రీట్‌ పేరుతో ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టారు. మొత్తం 2 రాత్రులు, 3 రోజులుగా సాగే ఈ టూర్‌ వైజాగ్‌ నుంచి మొదలవుతుంది. వైజాగ్‌ లోకల్‌లో ఉన్న వారితో పాటు ఇతర ప్రదేశాల నుంచి వైజాగ్‌కు చేరుకున్న వారు కూడా ఈ టూర్‌ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మే 21వ తేదీన ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC: సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే ఈ స్పెషల్‌ ప్యాకేజీ..
Irctc Vizag Retreat
Follow us on

సమ్మర్‌లో వైజాగ్ టూర్ ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే వైజ్‌కు సమీపంలో ఉన్న పలు ప్రదేశాలను సందర్శించాలని అనుకుంటున్నారా.? మీకోసమే ఐఆర్‌సీటీసీ మంచి టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. విశాఖ, అరకు, సింహాచలంను కవర్‌ చేస్తూ ఈ టూర్‌ సాగుతుంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వైజాగ్ రీట్రీట్‌ పేరుతో ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టారు. మొత్తం 2 రాత్రులు, 3 రోజులుగా సాగే ఈ టూర్‌ వైజాగ్‌ నుంచి మొదలవుతుంది. వైజాగ్‌ లోకల్‌లో ఉన్న వారితో పాటు ఇతర ప్రదేశాల నుంచి వైజాగ్‌కు చేరుకున్న వారు కూడా ఈ టూర్‌ ప్యాకేజీని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం మే 21వ తేదీన ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* మొదటి రోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వేస్టేసన్‌, బస్టాండ్‌ల నుంచి ప్రయాణికులను పికప్‌ చేసుకుంటారు. అనంతరం హోటల్‌కు తీసుకెళ్తారు. టిఫిన్‌ చేసిన తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రి బస వైజాగ్‌లోనే ఉంటుంది.

* ఇక రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరుతారు. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. తిరిగి రాత్రి మళ్లీ వైజాగ్‌కు చేరుకుంటారు.

* మూడో రోజు ఉదయం టిఫిన్‌కాగానే సింహాచలం బయలు దేరుతారు. సింహాచలం దర్శనం పూర్తి చేసుకొని మళ్లీ మధ్యాహ్నం సమయానికి వైజాగ్ రిటర్న్‌ అవుతారు. భోజనం తర్వాత సబ్‌మెరైన్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది.

* ఇక చివరిగా ప్రయాణికులు రైల్వేస్టేషన్, బస్టాండ్‌, ఎయిర్‌ పోర్ట్‌ ఇలా తమకు నచ్చిన చోట దిగొచ్చు దీంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరల వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. కంఫర్ట్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.7990, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10980, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19950గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ధరలు వేరు వేరుగా ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..