IRCTC: హైదరాబాద్‌ టూ థాయ్‌లాండ్‌ టూర్‌.. తక్కువ బడ్జెట్‌లో ఫారిన్‌ టూర్‌..

|

Nov 16, 2023 | 9:40 PM

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీనీ ట్రేజర్స్ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచే ఈ టూర్‌ ప్రారంభమవుతుంది.? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌ ప్యాకేజీ తక్కు బడ్జెట్‌లోనే తీసుకురావడం విశేషం. ఇంతకీ ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

IRCTC: హైదరాబాద్‌ టూ థాయ్‌లాండ్‌ టూర్‌.. తక్కువ బడ్జెట్‌లో ఫారిన్‌ టూర్‌..
Hyderabad To Thailand Tour
Follow us on

జీవితంలో ఒక్కసారైనా ఫారిన్‌ ట్రిప్‌ వేయాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తుంటారు. అయితే ఫారిన్‌ టూర్‌ అనగానే లక్షల్లో బడ్జెట్‌ అవుతుందని భావిస్తుంటాం. కానీ మనకు దగ్గరల్లో ఉన్న దేశాలకు ట్రిప్‌ వేస్తే తక్కువ బడ్జెట్‌లోనే టూర్‌ను పూర్తి చేసుకోవచ్చు. అలాంటి ఓ దేశమే థాయ్‌లాండ్‌. మీలాంటి వారి కోసమే ఐఆర్‌సీటీసీ బెస్ట్ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.

హైదరాబాద్‌ నుంచి థాయ్‌లాండ్‌కు ఉండే ఈ టూర్‌ ప్యాకేజీనీ ట్రేజర్స్ ఆఫ్‌ థాయ్‌లాండ్‌ ఎక్స్‌ హైదరాబాద్‌ పేరుతో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచే ఈ టూర్‌ ప్రారంభమవుతుంది.? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌ ప్యాకేజీ తక్కు బడ్జెట్‌లోనే తీసుకురావడం విశేషం. ఇంతకీ ఈ థాయ్‌లాండ్‌ ట్రిప్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్‌లో ప్రయాణం ఉంటుంది. బ్యాంక్‌తో పాటు పట్టాయ పట్టణాలను వీక్షించవచ్చు. ఈ టూర్‌ ప్యాకేజీ మొత్తం 3 రాత్రులు, 4 రోజుల పాటు ఉంటుంది. బ్రేక్‌ ఫాస్ట్, డిన్నర్‌లు ప్యాకేజీలో కవర్‌ అవుతాయి. డిసెంబర్‌ 13వ తేదీన ఈ టూర్‌ ప్రారంభంకానుంది. ప్యాకేజీలో భాగంగా 3 స్టార్​ హోటల్​ అకామడేషన్​ ఇస్తారు. 80 ఏళ్ల వరకు ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ అందిస్తారు.

ఇక ప్యాకేజీ ధర విషయానికొస్తే థాయ్‌లాండ్‌ ప్యాకేజీని సింగిల్‌ ఆక్యూపెన్సీ కోసం రూ. 65,180గా నిర్ణయించారు. అదే ఇద్దరు షేరింగ్‌లో వెళ్తే రూ. 55,610గా నిర్ణయించారు. ఇక ట్రిపుల్ షేరింగ్ విషయానికొస్తే రూ. 55,610గా ఉంది. ఇదిలా ఉంటే వీసా ఆన్​ అరైవెల్​, డ్రైవర్​- గైడ్​ టిప్స్​, లాండరీ, వైన్​, డ్రింక్స్​ ఖర్చులు ప్యాకేజీలో కవర్‌ కావు. వీటికే ప్రయాణికులే సొంతంగా డబ్బులు చెల్లించుకోవాలి. ఇక ఈ టూర్‌కి వెళ్లే వారి కోసం ఫ్లైట్ ట్రిప్‌ కోసం 6 నెలల వాలిడిటీతో ఉన్న పాస్‌పోర్ట్ ఉండాలి. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..