తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే దర్శన టికెట్స్, ట్రైన్, రూమ్ ఇలా అన్నింటిని వేరువేరుగా బుక్ చేసుకోవడం కాస్త ఇబ్బందితో కూడుకున్న అంశంగా చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారి కోసమే ఎలాంటి టెన్షన్ లేకుండా శ్రీవారి దర్శన టికెట్లతో పాటు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల శ్రీవారి దర్శన టికెట్లతో పాటు, తిరుపతి చుట్టు పక్కల ఉన్న పలు పుణ్య క్షేత్రాలనూ సైతం ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కానున్నాయి. పూర్వ సంధ్య టూర్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 4 రోజుల పాటు ఈ టూర్ సాగుతుంది. హైదరాబాద్ నుంచి మొదలయ్యే ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ఎక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాలి.? ప్యాకేజీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* తొలి రోజు ప్రయాణం సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ట్రైన్ నెంబర్ 12734 ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్, నల్లగొండలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు. సికింద్రాబాద్ స్టేషన్‌కు 7.5 గంటలకు, నల్లగొండ స్టేషన్ నుంచి 8.35 గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంగా ట్రైన్ జర్నీ ఉంటుంది.
* రెండో రోజు ఉదయం 06:55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హోటల్‌కి తీసుకెళ్తారు. ఫ్రెషప్ అనంతరం శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల దర్శనం ఉంటుంది. ఆ తర్వాత.. శ్రీ కాళహస్తి, తిరుచానూరు ఆలయాల సందర్శన ఉంటుంది. తర్వాత హోటల్‌కి చేరుకొంటారు. రాత్రి హోటల్‌లోనే బస చేయాలి.
* మూడో రోజు ఉదయం టిఫిన్ చేయగానే 08:30 గంటలకు వేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. సాయంత్ర 06:20 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకొని తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు.
* నాలుగో రోజు రైలు లింగంపల్లికి ఉదయం 6.55 గంటలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక నల్లగొండలో తెల్లవారు జామున 3.04 గంటలకు, సికింద్రాబాద్‌కు 5.35కి చేరుకుంటారు.
ప్యాకేజీ ధరల వివరాలు..
ప్యాకేజీ ధర విషయానికొస్తే.. స్టాండర్డ్ క్లాసులో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 7720గా నిర్ణయించారు. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 5860, ట్రిపుల్ ఆక్యూపెన్సీ ధర రూ.5,660గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లల కోసం వేర్వురు ధరలు ఉన్నాయి. ప్యాకేజీకి సంబంధించిన ఇతర వివరాలు, బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..