ఒకప్పుడు కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్‌కు ఏ ఊటినే, కశ్మీరో వెళ్లే వారు. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. కొత్త జంటలు గోవాకు చక్కెస్తున్నారు. అక్కడి అందమైన బీచ్‌లు, పబ్‌లలో ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా హనీమూన్‌ను గోవాలో ప్లాన్ చేద్దామనుకుంటున్నారా.?
అయితే మీ కోసమే ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతోన్న ఈ టూర్ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్‌లో జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆగస్టు 23వ తేదీ, సెప్టెంబర్ 13వ తేదీల్లో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇక బడ్జెట్ కూడా తక్కువే కావడం విశేషం..
* తొలి రోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఉదయం 11.20 గంటలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి జర్నీ మొదలువుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అనంతం హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్ పూర్తి కాగానే జువారీ రివర్ సందర్శన ఉంటుంది. రాత్రికి గోవాలోనే బస చేయాల్సి ఉంటుంది.
* ఇక రెండో రోజు సౌత్ గోవా టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా ఓల్డ్ గోవా చర్చ్, బసిలికా ఆఫ్ బామ్ జీసస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్‌రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేశీ ఆలయం, మిరామర్ బీచ్ వంటి ప్రదేశాలు కవర్ అవుతాయి. ఇందులో భాగంగా మండోవి రివర్‌లో బోట్ క్రూజ్ ప్రయాణికులు ఎంతగానో ఆకట్టుకుంటోంది.
* మూడో రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫోర్ట్ అగ్వాడా, కండోలిమ్ బీచ్, బాగా బీచ్ సందర్శన ఉంటుంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనంతరం అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ సందర్శనం ఉంటుంది.
* నాలుగో రోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు గోవా నుంచి బయలు దేరితే సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోవడం టూర్ మూగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా ఉంటాయి..
ప్యాకేజీ ధరల విషయానికొస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.18,935, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,245, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.24,620 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటివన్నీ కవర్ అవుతాయి.
మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..