IRCTC Tirupati: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా..? విమాన ప్రయాణం చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారా.? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) మీకోసం ఓ సదవకాశాన్ని తీసుకొచ్చింది. ఒక రాత్రి/రెండు రోజుల టూర్ ప్యాకేజీని ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్యాకేజీలో ఏయో ప్రదేశాలు చూడొచ్చు.? టికెట్ ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ఒక్కో వ్యక్తి రూ. 11,125 చెల్లించాల్సి ఉంటుంది.
* ప్రతీ శుక్రవారం హైదరాబాద్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానం బయలు దేరుతుంది.
* ఎస్‌జీ 3729 నెంబర్ విమానం ఉదయం 9.50 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి, 11.10 నిమిషాలకు రేణిగుంటకు చేరుతుంది.
* తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎస్‌జీ 4053 నెంబర్ విమానం సాయంత్రం 06.55 నిమిషాలకు బయలుద దేరి హైదరాద్‌కు 08.15 నిమిషాలకు చేరుతుంది.
* టూర్‌లో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం చేయిస్తారు. అనంతరం కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్‌లను సందర్శించవచ్చు.
* ప్యాకేజీలో భాగంగా తిరుపతిలో ఒక రాత్రి ఏసీ హోటల్ అకామిడేషన్ కల్పిస్తారు. 1 బ్రేక్‌ఫాస్ట్, 2 లంచ్, 1 డిన్నర్ అందిస్తారు.
* ఇతర ప్రదేశాలకు తిప్పడానికి ఏసీ వాహనాలను ఉపయోగిస్తారు.
* గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అదనంగా అందిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ సికింద్రాబాద్, 9‑1‑129/1/302, మొదటి ఫ్లోర్, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా, ఎస్‌డీ రోడ్, తెలంగాణ. 040-27702407, 8287932230, 8287932228, 8287932229, 9701360701 సంప్రదించండి.
Liver Health: కాలేయం చెడిపోతే మనిషి పరిస్థితి దారుణం.. ఈ ఐదు పానీయాలు సూపర్ క్లీనర్స్..