Travel With Children: కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొన్ని చోట్ల రాత్రిపూట కర్ఫ్యూ మొదలైంది. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలంటే టెన్షన్ తప్పదు.ఈ సమయంలో మీరు పిల్లలతో కలిసి ప్రయాణం చేయబోతున్నట్లయితే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.
1. పిల్లలకు పరిస్థితిని వివరించండి
పిల్లలతో ప్రయాణం చేసే ముందు కరోనా పరిస్థితిని గురించి వారికి వివరించడం ముఖ్యం. తద్వారా వారు దాని తీవ్రతను అర్థం చేసుకుంటారు. మీరు చెప్పిన సూచనలు పాటిస్తారు.
2. పిల్లల కోసం ప్రత్యేక బ్యాగ్
మీ పిల్లలు బ్యాగ్‌ని మోయగల శక్తి ఉంటే వారి కోసం ఒక ప్రత్యేక బ్యాగ్‌ని సిద్ధం చేయండి. అందులో శానిటైజర్, వైప్స్, ఎక్స్‌ట్రా ఫేస్ మాస్క్ మొదలైనవాటిని ఉంచండి. వాటిని సరిగ్గా ఉపయోగించడం నేర్పండి.
3. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినండి
కరోనా కాలంలో బయట ఏదైనా తినడం సురక్షితం కాదు కాబట్టి ముందుగానే మీ పిల్లలకు దీని గురించి చెప్పండి. ప్రయాణంలో కూడా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకెళ్లండి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ మొదలైన వాటిని మీతో ఉంచుకోండి. వీలైతే ఇంటి నుంచే నీటిని తీసుకువెళ్లండి. బయట ఏదైనా తినడం తాగడం మంచిది కాదు.
4. పిల్లలను కిటికీ దగ్గర కూర్చోబెట్టండి
ప్రయాణంలో పిల్లలను ఎప్పుడూ కిటికీ వైపు కూర్చోబెట్టండి. ఇది పిల్లలను ఇతర వ్యక్తులతో సంబంధానికి దూరంగా ఉంచుతుంది. దీనికి ముందు ఆ స్థలాన్ని, కిటికీని బాగా శుభ్రం చేయండి. తద్వారా వైరస్‌కి దూరంగా ఉంటారు.
5. మెడికల్ కిట్ ఉంచండి
పిల్లలతో ప్రయాణించే ముందు మెడికల్ కిట్‌ను దగ్గర ఉంచుకోండి. ఈ కిట్‌లో కొన్ని ప్రాథమిక ఔషధాలను ఉంచండి. అత్యవసర సమయంలో పిల్లలకు ప్రథమ చికిత్స కోసం అవసరమవుతుంది.