IRCTC Hotel Booking: దేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆయా నగరాల్లో బస చేసేందుకు ముందుగానే హోటల్ రూమ్‌లు బుకింగ్ (Hotel Rooms Booking) చేసుకునే ప్రత్యేక సదుపాయం కల్పిస్తోంది. ఈ సేవలతో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ సహా దేశంలోని 135 పైగా నగరాలు, పట్టణాల్లో హోటల్ అడ్వాన్స్ బుకింగ్ చేయొచ్చు. ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయి. మనం ఎంచుకునే హోటల్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది. మీరు మీకు నచ్చిన హోటల్ సెలెక్ట్ చేసుకొని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మరి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో హోటల్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం రండి.
గదులు ఎలా బుక్ చేసుకోవాలంటే..
*ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
*హోటల్ పేరు లేదా సిటీ పేరు ఎంటర్ చేయాలి.
*చెకిన్, చెకౌట్ తేదీలను ఎంటర్ చేయాలి.
* అతిథుల సంఖ్య, గదుల సంఖ్య సెలెక్ట్ చేయాలి.
* సెర్చ్ ఆప్షన్ నొక్కితే ఆయా తేదీల్లో అందుబాటులో ఉన్న హోటళ్ల జాబితా కనిపిస్తుంది.
* అందులో మీరు కోరుకున్న హోటల్‌లో రూమ్‌ను ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు.
* ఐఆర్‌సీటీసీ లాగిన్ చేసి పేమెంట్ పూర్తి చేస్తే రూమ్ బుకింగ్ కన్ఫామ్ అవుతుంది.
రిటైరింగ్ రూమ్స్ కూడా..
ప్రయాణికుల సౌకర్యానికి తగ్గట్టుగా సింగిల్, డబుల్ రూమ్స్, ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. 20 మంది వరకు కూడా గ్రూప్ బుకింగ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు చెకిన్, చెకౌట్ పాలసీ ఉంటుంది. హోటల్ బుకింగ్ చేసే సమయంలో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మీకు హోటల్ గది అవసరం లేదనుకుంటే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న ట్రైన్ టికెట్ పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేసి రిటైరింగ్ రూమ్స్ బుకింగ్ చేసుకోవచ్చు.
New #adventures are awaiting! #PackYourBags & find #pocketfriendly #hotel #rooms starting at ₹600 per night on- the- go on #IRCTC portal. Enjoy the facilities available in 135+ #cities across #India. #Book right away on https://t.co/YkHDZXq3v4 & #explore new #destinations
— IRCTC (@IRCTCofficial) March 23, 2022
Also Read:Watch Video: బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌పై దాడి.. సెక్యూరిటీని దాటుకుంటూ..
Hand Shivering Exercise: మీ చేతులు వణుకుతున్నాయా.. అయితే ఇలా చేయండి.. తగ్గిపోతుంది..!
Gold: ఒకరి వద్ద గరిష్ఠంగా ఎంత బంగారం ఉండాలో తెలుసా.. పరిమితికి మించి ఉంటే ఏమవుతుందంటే..