మహిళలకు బెస్ట్ సోలో ట్రిప్ డెస్టినేషన్.. అక్కడి అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!

|

Dec 04, 2023 | 1:59 PM

వాటర్ స్పోర్ట్స్‌లో మునిగిపోతారు. పాండిచ్చేరి బీచ్‌లలో వాటర్ స్పోర్ట్స్‌ని ఆస్వాదిస్తారు.. స్కూబా డైవింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. షాపింగ్ ప్రియులకు కూడా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బెస్ట్‌గా ఉంటుంది.. స్థానిక బజార్లలో మీరు కళాత్మక హస్తకళలు, బట్టలు, ఆభరణాలు, అగరుబత్తులు, కొవ్వొత్తులు మరొన్నే గృహాలంకరణ వస్తువులను మీకు అందుబాటు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

మహిళలకు బెస్ట్ సోలో ట్రిప్ డెస్టినేషన్.. అక్కడి అందాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు..!
Solo Trip In Pondicherry
Follow us on

మహిళలు ఒంటరిగా ఏదైనా యాత్రను ప్లాన్ చేసుకోవానుకుంటే.. వారికి తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరి ఉత్తమైనదిగా చెప్పాలి. మహిళలు ఒంటరిగా ప్రయాణించడానికి పుదుచ్చేరి అత్యంత సురక్షితమైన పర్యాటకంగా చెప్పాలి. ఈ ఫ్రెంచ్ నగరంలో మహిళలు సోలో ట్రిప్‌ను ఎంతోబాగా ఎంజాయ్‌ చేయగలరు. అంతేకాదు.. టూరిస్టులకు ఇది స్వర్గధామం వంటిదిగా చెబుతారు. ఇక్కడి ఫ్రెంచ్ తరహా ఇళ్లు, చర్చిలు, కొత్తగా నిర్మించిన ఫ్రెంచ్ తరహా దుకాణాలు పాండిచ్చేరి అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. పాండిచ్చేరిలోని ప్రసిద్ధ ఆకర్షణల్లో పారడైజ్ బీచ్, ఆరోవిల్, రాక్ బీచ్, పాత లైట్ హౌస్, శ్రీ అరబిందో ఆశ్రమం, రాజ్ నివాసం, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, మహాత్మా గాంధీ విగ్రహం అత్యంత ఆకర్షణీయమైనవి.

అంతేకాదు..పాండిచ్చేరిలో అద్భుతమైన బీచ్‌లు కూడా ఉన్నాయి. పాండిచ్చేరిలోని కొన్ని టాప్ బీచ్‌లు- ప్రొమెనేడ్ బీచ్, – ప్రశాంతత బీచ్, – మహే బీచ్, – ఆరోవిల్ బీచ్, పారడైజ్ బీచ్, – రెప్పో బీచ్‌పిసి బీచ్‌లు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇకపోతే, పాండిచ్చేరిని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడైనేది పరిశీలించినట్టయితే..అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు పాండిచ్చేరిని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సమయంలో పాండిచ్చేరిలో వాతావరణం చల్లగా ఉంటుంది.

వాస్తవానికి, సంవత్సరంలో ఏ నెలలోనైనా పాండిచ్చేరి పర్యటనకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎండను పట్టించుకోనట్లయితే మీరు వేసవిలో కూడా సందర్శించవచ్చు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు 26 డిగ్రీల సెల్సియస్ నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, పాండిచ్చేరిలో చేయవలసిన ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి.. అవేంటంటే..పాండిచ్చేరిలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ సంస్కృతి, ప్రపంచ వంటకాల రుచిని తప్పక ఆస్వాదిచండి. ఇక్కడి స్థానిక వంటకాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రశాంతత, ప్రకృతిని ఇష్టపడే వారికి ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలలు నిష్కళంకంగా ఎగిసిపడే బీచ్ దగ్గర కూర్చోని మీరు ప్రపంచాన్ని మర్చిపోయి సేదతీరుతారు..మీరు పాండిచ్చేరిలో ఉన్నప్పుడు యోగా, ధ్యానం నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రసిద్ధ ఆశ్రమం కూడా

వాటర్ స్పోర్ట్స్‌లో మునిగిపోతారు. పాండిచ్చేరి బీచ్‌లలో వాటర్ స్పోర్ట్స్‌ని ఆస్వాదిస్తారు.. స్కూబా డైవింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ చాలా ప్రసిద్ధి. షాపింగ్ ప్రియులకు కూడా ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బెస్ట్‌గా ఉంటుంది.. స్థానిక బజార్లలో మీరు కళాత్మక హస్తకళలు, బట్టలు, ఆభరణాలు, అగరుబత్తులు, కొవ్వొత్తులు మరొన్నే గృహాలంకరణ వస్తువులను మీకు అందుబాటు ధరలోనే కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..