Dark Tourism: యూత్ కి డార్క్ టూరిజం పట్ల పెరుగుతున్న క్రేజ్.. భారత దేశంలో చూడాల్సిన ప్లేసెస్ ఇవే..

కొత్త ప్రదేశాలలో పర్యటించడానికి కొత్త విషయాలను తెలుసుకోవడానికి ప్రయాణం చేయడం అంటే ఇష్టపడేవారున్నారు. అయితే కొంతమందికి సాహస యాత్రలన్నా.. దైర్య సాహాసాలాను ప్రదర్శించడానికి ఇష్టం. ప్రస్తుతం ప్రజల్లో డార్క్ టూరిజం పట్ల క్రేజ్ కనిపిస్తోంది. ఈ రోజు ఈ డార్క్ టూరిజం అంటే ఏమిటి ? ఇది ప్రజలలో ఎందుకు ప్రాచుర్యం పొందిందో తెలుసుకుందాం..

Dark Tourism: యూత్ కి డార్క్ టూరిజం పట్ల పెరుగుతున్న క్రేజ్.. భారత దేశంలో చూడాల్సిన ప్లేసెస్ ఇవే..
Dark Tourism In India
Image Credit source: social media

Updated on: Apr 27, 2025 | 5:05 PM

అందరూ విహారయాత్రకు వెళ్లడానికి ఇష్టపడతారు. నేటి జీవితాలు రణగొణధ్వనులతో ఉరుకుల పరుగుల మధ్య సాగుతోంది. దీంతో ఒత్తిడి చాలా పెరిగింది. దీంతో మనసుకి, మెదడుకి ప్రశాంతత ఇచ్చేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. మారుతున్న కాలంతో పాటు.. ప్రయాణ ధోరణులు కూడా చాలా మారిపోయాయి. ఇప్పుడు పర్వతాలు, కొండ ప్రాంతాలు లేదా మంచును చూడటానికి బదులుగా, ప్రజలు ప్రయాణించడానికి కొత్త ప్రాంతాలను.. కొత్త మార్గాలను కనుగొంటున్నారు. వీటిలో ఒకటి డార్క్ టూరిజం.

ప్రజలు ఇప్పుడు విచారం, విషాదం లేదా ఏదైనా భయంకరమైన సంఘటన జరిగిన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ప్రదేశాలను ఎక్కువగా అన్వేషిస్తోంది. గత కొన్ని రోజులుగా.. యూరప్ లాగే, భారతదేశంలో కూడా ప్రజలు భయంకరమైన ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజు ప్రజలు డార్క్ టూరిజంను ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసుకుందాం..

డార్క్ టూరిజం పట్ల పెరుగుతున్న క్రేజ్

ఇవి కూడా చదవండి

గత కొంతకాలంగా ప్రజల్లో డార్క్ టూరిజం పట్ల క్రేజ్ కనిపిస్తోంది. చరిత్ర, మానవ అనుభవాలను భిన్నమైన, తీవ్రమైన దృక్కోణం నుంచి చూపించే ప్రదేశాలను ప్రజలు సందర్శిస్తున్నారు. డార్క్ టూరిజం ప్రజలకు గత సంఘటనలను.. వాటి ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇది చారిత్రక సంఘటనల గురించి సమాచారాన్ని అందించడమే కాదు.. మన ప్రపంచంలోని చీకటి కోణాన్ని, చరిత్ర చెప్పలేని అంశాలను కూడా తెలియజేస్తుంది.

జనరేషన్ Z మనుషులు.. హాంటెడ్ ప్రదేశాలు

ముఖ్యంగా జనరేషన్ Z ప్రజలు హాంటెడ్ ప్రదేశాలను లేదా కొంత విషాదం జరిగిన ప్రదేశాలను సందర్శిస్తున్నారు. ప్రతి క్షణం ఉత్సాహంగా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి వీరు ఇష్టపడుతున్నారు. వీరు పుస్తకాలకే పరిమితం కాకూడదనుకుంటారు. అక్కడికి వెళ్లి ఈ ప్రదేశంలో నిజంగా ఏమి జరిగిందో స్వయంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రదేశాలకు సోషల్ మీడియా ద్వారా కూడా చాలా ప్రచారం లభిస్తోంది. అయితే, భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ చీకటి పర్యాటక ప్రదేశాలు ఏమిటంటే

జలియన్ వాలాబాగ్ – 1919 నాటి ఊచకోతకు సాక్షిగా నిలిచిన ఈ తోట.. అమాయక ప్రజల త్యాగాన్ని.. బ్రిటిష్ పాలన క్రూరత్వాన్ని మనకు గుర్తు చేస్తుంది.

పోర్ట్ బ్లెయిర్- బ్రిటిష్ పాలనలో కాలా పానీ అని పిలువబడే పోర్ట్ బ్లెయిర్‌లోని జైలు భారత స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ వారు చేసిన దురాగతాలు, పోరాటాల కథలను చెబుతుంది.

విక్టోరియా మెమోరియల్ – ఈ అద్భుతమైన స్మారక చిహ్నం బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తుంది.

కుల్ధారా గ్రామం- రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఈ మర్మమైన నిర్జన గ్రామాన్ని 19వ శతాబ్దంలో ఈ గ్రామ నివాసితులు రాత్రికి రాత్రే వదిలిపెట్టారు. ఈ గ్రామం శాపగ్రస్తమైందని అంటారు.

రూప్‌కుండ్ సరస్సు- రూప్‌కుండ్ సరస్సు అస్థిపంజర సరస్సుగా ప్రసిద్ధి చెందింది. వేల సంవత్సరాల నాటి మానవ అస్థిపంజరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అస్థిర పంజరాలు.. మరణాలు నేటికీ రహస్యంగానే ఉన్నాయని నమ్మకం.

డుమాస్ బీచ్- గుజరాత్ లోని సూరత్ నగరానికి నైరుతి దిశలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఈ బీచ్ నల్లటి ఇసుక.. దెయ్యాల సంఘటనలతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆత్మశాంతిలేని ఆత్మలు వెంటాడుతాయని ఓ నమ్మకం.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..