Goa Travel Restrictions: పర్యాటకులను ఆహ్వానిస్తున్న గోవా.. 72 గంటలలోపు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పని సరి

|

Jul 07, 2021 | 8:54 PM

Goa Travel Restrictions : దేశంలోని సెకండ్ వేవ్ విజృంభణ నెమ్మదించిన తర్వాత పలు రాష్ట్రాలు దశలవారీగా అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. క్రమేపీ పర్యాటక రంగం క్రమేపీ ఊపందుకుంటోంది...

Goa Travel Restrictions: పర్యాటకులను ఆహ్వానిస్తున్న గోవా.. 72 గంటలలోపు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పని సరి
Goa
Follow us on

Goa Travel Restrictions : దేశంలోని సెకండ్ వేవ్ విజృంభణ నెమ్మదించిన తర్వాత పలు రాష్ట్రాలు దశలవారీగా అన్ లాక్ ప్రక్రియను ప్రారంభించాయి. క్రమేపీ పర్యాటక రంగం క్రమేపీ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో గోవా కూడా పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ఇప్పటికే గోవాకు పలు బస్సులు పర్యాటకులను తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నాయి.

అయితే పర్యాటకులకు కొన్ని నిబంధనలను గోవా సర్కార్ పెట్టింది. కరోనా నెగటివ్‌ రిపోర్టు ఉంటేనే తమ రాష్ట్రంలోని పర్యాటకుల్ని అనుమతిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 72 గంటలలోపు నెగటివ్‌ రిపోర్టులు ఉన్న ప్రయాణీకులనే బస్సుల్లో అనుమతించారు. గోవాకు వెళ్లే పర్యాటకులంతా ఈ సూచన గమనించాలని కోరుతూ పలు రాష్ట్రాల పర్యాటక శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉన్న ప్రాంతం గోవా. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరం అని అంటారు. 16 వ శతాబ్దం లో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరాలు ఏర్పరచుకుని కొద్దికాలంలోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 450 ఏండ్ల తరువాత, 1961లో భారత ప్రభుత్వం సైనికచర్య ద్వారా గోవాను తన అధీనంలోకి తీసుకుంది. గోవాలో చక్కని బీచ్ లు, ప్రత్యేకమైన కట్టడాలు, విశిష్టమైన వన సంపద.. ఇవన్నీ కలిపి గోవా మంచి పర్యాటక కేంద్రంగా కావడానికి తోడ్పడ్డాయి. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. గోవా ఆర్థికరంగం వృద్ధికూడా 1990-2000 కాలంలో 8.23% సాదింపబడింది. భారతదేశానికి వచ్చే మొత్తం విదేశీయాత్రికులలో 12% మంది గోవాను సందర్శిస్తున్నారు.

Read Also:   బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన దొంగ.. సీసీ కెమెరా నుంచి తప్పించుకోవాటానికి గొడుగుతో కవరింగ్