Mussoorie: ఆ పర్యాటక ప్రాంతం సందర్శించాలంటే.. కరోనా రిపోర్టు ఉండాల్సిందే.. లేకపోతే..

| Edited By: Shaik Madar Saheb

Jul 10, 2021 | 8:22 AM

Covid-19 negative report: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను ఎత్తివేయడంతో.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల

Mussoorie: ఆ పర్యాటక ప్రాంతం సందర్శించాలంటే.. కరోనా రిపోర్టు ఉండాల్సిందే.. లేకపోతే..
Mussoorie
Follow us on

Covid-19 negative report: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను ఎత్తివేయడంతో.. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని పర్యాటక ప్రాంతమైన ముస్సోరి సందర్శనకు వచ్చేవారు.. కరోనా నిబంధనలు పాటించడం లేదు. కెంప్టీ వాట‌ర్‌ఫాల్స్ దగ్గర పర్యాటకులు మాస్కులు ధరించకుండా.. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కెంప్టీ వాట‌ర్‌ఫాల్స్ వద్ద పెద్ద ఎత్తున సందర్శకులు ఉన్న వీడియో వైరల్‌గా మారింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశముందంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పించారు.

దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్యాటకులకు కట్టుబాట్లు విధించింది. కెంప్టీ జ‌ల‌పాతం వ‌ద్ద 50 మంది క‌న్నా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి టూరిస్టులు ఉండ‌కూడ‌ద‌ని అధికారులకు ఆదేశించింది. ఆ వాట‌ర్‌ఫాల్స్‌కు వ‌చ్చిన వాళ్లు అర‌గంట క‌న్నా ఎక్కువ స‌మ‌యం అక్కడ ఉండొద్దంటూ సూచించింది. దీంతోపాటు టూరిస్టుల తాకిడిని మానిట‌ర్ చేసేందుకు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ ఆదేశాల అనంతరం.. పోలీసులు మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ముస్సోరి వచ్చే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలనే నిబంధన విధించారు. మైదాన ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నందున సేద తీరేందుకు ముస్సోరికి వస్తున్నారు. అయితే.. పర్యాటకులు భారీగా వస్తుండటంతో కరోనా మళ్లీ విజృంభించే అవకాశముందని పేర్కొన్నారు. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే ముస్సోరీలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. రిపోర్టు లేని పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నట్లు ముస్సోరి పోలీసులు తెలిపారు.

Also Read:

Coronavirus: కరోనా జంతువుల నుంచి మనుషులకు.. శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయన్న శాస్త్రవేత్తల బృందం

Suicide: మితిమీరిన అభిమానం.. నచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చిందని నిప్పంటించుకుని అభిమాని ఆత్మహత్య