Vizag Araku Tour Package: కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిస్తున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అరకు వెళ్లాలనుకునే పర్యాటకులను ఆహ్వానిస్తూ ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, ప్యాకేజీ బుక్ చేసుకోవడానికి https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ను సందర్శించాల్సి ఉంది.
వైజాగ్-అరకు హాలీడే ప్యాకేజీ పేరుతో ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో రెండు రాత్రులు, మూడు పగలు ఉండనున్నాయి. హైదరాబాద్ నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి వైజాగ్ , అరకు ను సందర్శించాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ మంచి ఉపయోగం. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉండనుంది. ఇక పర్యాటకులు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరుకున్న తర్వాత టూర్ ప్యాకేజీ మొదలవుతుంది.
ముందుగా వైజాగ్ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ చేరుకున్న పర్యాటకులను ఐఆర్‌సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. అనంతరం పర్యాటకులకు విశాఖ పట్నంలోని సందర్శనీయమైన ప్రదేశాలను చూసే వీలుకల్పిస్తారు. తోట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, రామానాయుడు ఫిలిమ్ స్టూడియో, రుషికొండ బీచ్, కైలాస గిరి, సబ్‍మెరైన్ మ్యూజియం, రామకృష్ణా బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ సందర్శించొచ్చు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేసే ఏర్పాట్లు చేస్తారు.
మర్నాడు ఉదయం టిఫిన్ తర్వాత అరకుకు వెళ్ళాలి. ఈ దారిలో తైడా జంగిల్ బెల్స్, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం ను సందర్శించవచ్చు. మధ్యాహ్నం లంచ్ తర్వాత .. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ సందర్శించొచ్చు. సాయంత్రం తిరిగి విశాఖపట్నం చేరుకోవాలి.. రాత్రికి అక్కడే బస చేసి.. మూడో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత పర్యాటకులను . విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ. 6,160 ట్రిఫుల్ ఆక్యుపెన్సీ ధర. అదే డబుల్ ఆక్యుపెన్సీ కి రూ. 8610 కాగా సింగిల్ ఆక్యుపెన్సీ కి రూ. 15, 730 ధర చెల్లించాల్సి ఉంది.
Also Read: జలుబు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి