విశాఖ టు బ్యాంకాక్, థాయ్ లాండ్ కేవలం 2 గంటల్లోనే.. అప్పటి నుంచే అమల్లోకి..

| Edited By: Srikar T

Apr 10, 2024 | 11:11 AM

విశాఖ నుంచి బ్యాంకాక్‎కు ఏప్రిల్ 9 మంగళవారం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయింది. ఇక థాయ్ మసాజ్ కావాలనుకునే వాళ్ళెవరైనా కేవలం గంటా 15 నిమిషాల్లో విశాఖ నుంచి థాయ్ లాండ్ చేరుకోవచ్చు. వారానికి మూడు రోజులు అంటే ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖ‎కు 11.20కు చేరుకోనున్న ఫ్లైట్ తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి బయల్దేరివెళ్లనుంది.

విశాఖ టు బ్యాంకాక్, థాయ్ లాండ్ కేవలం 2 గంటల్లోనే.. అప్పటి నుంచే అమల్లోకి..
Air Asia
Follow us on

విశాఖ నుంచి బ్యాంకాక్‎కు ఏప్రిల్ 9 మంగళవారం నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయింది. ఇక థాయ్ మసాజ్ కావాలనుకునే వాళ్ళెవరైనా కేవలం గంటా 15 నిమిషాల్లో విశాఖ నుంచి థాయ్ లాండ్ చేరుకోవచ్చు. వారానికి మూడు రోజులు అంటే ప్రతి మంగళ, గురు, శని వారాల్లో బ్యాంకాక్ నుంచి రాత్రి 10.05 కి బయల్దేరి విశాఖ‎కు 11.20కు చేరుకోనున్న ఫ్లైట్ తిరిగి రాత్రి 11.50 కి విశాఖ నుంచి బయల్దేరివెళ్లనుంది. ఎయిర్ ఏషియా ఫ్లైట్ ఈ సౌకర్యాన్ని కల్పించింది. మంగళవారం బయలుదేరనున్న తొలిసర్వీస్ ప్రయాణికులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి వీడ్కోలు పలికింది ఏయర్ ట్రావెల్స్ అసోసియేషన్, వైజాగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్.

అతి తక్కువ ధరకే..

విశాఖవాసులకు నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌కు ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ నడపాలని నిర్ణయించింది. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ కూడా అందిస్తోంది. ఏప్రిల్ 9 నుండి అక్టోబరు 26, 2024 వరకు ప్రయాణ కాలానికి జనవరి 30, 2024 లోపు బుకింగ్ చేసుకున్న వాళ్లకు 7,999 రూపాయల నుండి ఆల్ ఇన్ వన్ వే ప్రారంభ ధర ఆఫర్‎గా ఎయిర్‌లైన్ ప్రకటించింది. భారతదేశం కంటే థాయిలాండ్ ఒక గంట 30 నిమిషాలు ముందుంటుంది.

త్వరలో కౌలాలంపూర్ కూడా..

బ్యాంకాక్, కౌలాలంపూర్ సర్వీసుల కోసం ఏయిర్ ట్రావెల్స్ అసోసియేషన్‎తో పాటు టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రాలు కూడా కృషి చేశాయి. టీటీఏఏ అధ్యక్షుడు కె. విజయ్‌ మోహన్‌ మాట్లాడుతూ.. మలేషియాలోని ఎయిర్‌ ఏషియా ప్రధాన కార్యాలయానికి అసోసియేషన్‌ ప్రతినిధి బృందం వెళ్లి వైజాగ్‌, మలేషియా, థాయ్‌లాండ్‌లకు విశాఖ నుంచి డిమాండ్ ఉందని ఒప్పించామన్నారు. త్వరలో కౌలాలంపూర్ కూడా వైజాగ్‌ నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..