Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఒక్కరే లోకాన్ని చుట్టిరావాలని ఉందా? కానీ ఎక్కడికి వెళ్తే సేఫ్ అని ఆలోచిస్తున్నారా? మీలాంటి ధైర్యవంతులైన మహిళల కోసమే ట్రావెల్ ఐకాన్ షెనాజ్ ట్రెజరీ ఒక స్పెషల్ లిస్ట్ సిద్ధం చేశారు. కేరళలోని మంచు కొండల నుండి వియత్నాం వీధుల వరకు.. మహిళలకు గౌరవం, రక్షణ లభించే ఆ ఆరు అద్భుతమైన ప్రాంతాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Solo Female Travel Safe Destinations

Updated on: Jan 18, 2026 | 3:20 PM

ఆడవాళ్లకు అడ్వంచెరస్ టూర్ సాధ్యమేనా? ఇదసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫేనా?.. అనే ప్రశ్నకు రెండూ సాధ్యమే అని చెబుతున్నారు షెనాజ్ ట్రెజరీ. 2026లో మహిళలు తప్పక చూడాల్సిన ప్రదేశాల జాబితాలో మన దేశంలోని మేఘాలయ, నాగాలాండ్ వంటి రాష్ట్రాలతో పాటు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ కూడా చేరిపోయింది. సోలో ట్రావెలింగ్ చేయాలనుకునే మహిళలకు ఇవి ఎందుకు బెస్ట్ ఛాయిస్ అంటే..

1. మున్నార్, ఫోర్ట్ కొచ్చి (కేరళ)

కేరళలోని మున్నార్ మంచు కొండలు, టీ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడి స్థానికులు పర్యాటకులను ఎంతో గౌరవిస్తారు, దీనివల్ల ఒంటరిగా వచ్చే మహిళలకు ఇక్కడ ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఫోర్ట్ కొచ్చిలోని సంస్కృతి, కళలు మహిళా యాత్రికులకు సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తాయి.

2. మేఘాలయ

మేఘాలయ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ మహిళా ప్రధాన సమాజం ఉంటుంది. ఖాసీ మరియు గారో తెగల్లో మహిళలే కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఇక్కడ మహిళా పర్యాటకులకు అత్యంత గౌరవం లభిస్తుంది. షిల్లాంగ్, మావ్లిన్నాంగ్ వంటి ప్రాంతాలు సోలో ట్రావెలర్స్‌కు కేరాఫ్ అడ్రస్.

3. నాగాలాండ్

నాగాలాండ్‌లోని కోహిమా దిమాపూర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ బాండ్స్ చాలా బలంగా ఉంటాయి. పర్యాటకులకు ఏదైనా అవసరమైతే స్థానికులు స్వచ్ఛందంగా సహాయం చేస్తారు. ముఖ్యంగా ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ సమయంలో మహిళలు ఇక్కడ ఎంతో క్షేమంగా పర్యటించవచ్చు.

4. అండమాన్ దీవులు

ప్రశాంతతను కోరుకునే మహిళలకు అండమాన్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇక్కడి కఠినమైన స్థానిక చట్టాలు భద్రతా చర్యల వల్ల మహిళలు ఒంటరిగా స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ వంటి సాహస కృత్యాలను ఆస్వాదించవచ్చు.

5. ఫుకెట్ (థాయ్‌లాండ్)

అంతర్జాతీయ పర్యటన చేయాలనుకునే మహిళలకు ఫుకెట్ అత్యంత సురక్షితమైనది. ఇక్కడ మహిళల కోసం ప్రత్యేకమైన అకామోడేషన్లు మరియు వెల్‌నెస్ రిట్రీట్లు ఉన్నాయి. ద్వీపాల మధ్య తిరగడానికి ఇక్కడ ఎంతో స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది.

6. వియత్నాం

తక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణం చేయాలనుకునే మహిళలకు వియత్నాం బెస్ట్. ఇక్కడి హనోయి, హోయి ఆన్ వంటి నగరాల్లో రాత్రిపూట ఒంటరిగా నడిచినా ఎంతో భద్రంగా అనిపిస్తుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.