Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లో సందర్శించాల్సిన 5 సుందర ప్రదేశాలు..! ఏంటో తెలుసా..?

| Edited By: uppula Raju

Jul 10, 2021 | 5:58 AM

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ప్రకృతికి పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో ప్రదేశాలు సహజసిద్దంగా, అందంగా ఉంటాయి.

Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌లో సందర్శించాల్సిన 5 సుందర ప్రదేశాలు..! ఏంటో తెలుసా..?
Himachal Pradesh
Follow us on

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ప్రకృతికి పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో ప్రదేశాలు సహజసిద్దంగా, అందంగా ఉంటాయి. అద్భుతమైన హిమాలయ పర్వత శ్రేణులు, మంచుతో కప్పబడిన శిఖరాలు, పురాతన మఠాలు, ఆకుపచ్చ పచ్చికభూములు, మెరిసే సరస్సులు, సహజమైన లోయలు ఉంటాయి. ఇవి మీ మనసుకు ఉత్తేజం కలిగిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ పర్యాటక కేంద్రం మరియు ఆఫ్‌బీట్ గమ్యం రెండింటి మిశ్రమం. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో సిమ్లా, మనాలి, కులు, మెక్లియోడ్గంజ్, ధర్మశాల ఉన్నాయి. అయితే ఆఫ్‌బీట్ ప్రదేశాలలో చిట్కుల్, జిభి ఉన్నాయి. జనాల నుంచి దూరంగా ఉండాలని కొంత ఏకాంతం కావాలనుకునేవారికి హిమాచల్ ప్రదేశ్ బెస్ట్ ఛాయిస్. ఇక్కడ తప్పక సందర్శించాల్సిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. షోజా
షోజా సిరాజ్ లోయలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు దీనిని తప్పకుండా సందర్శిస్తారు. మీరు గంభీరమైన పర్వతాల దృశ్యాలను ఆస్వాదించవచ్చు, సెరోల్సర్ సరస్సును వీక్షించవచ్చు. ఓక్ చెట్ల మధ్య నడవవచ్చు.

2. రాఖం
దట్టమైన అడవులు, అద్భుతమైన పర్వతాలతో ఉన్న ఈ చిన్న గ్రామంలో చాలా సుందర ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి ప్రియులు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నల్ల ఎలుగుబంటి, కస్తూరి జింక, నీలి గొర్రెలు, మరెన్నో పర్వత జంతువులను చూడవచ్చు.

3. జంజెలి
సాహస ప్రియులందరికీ ఇది అనువైన ప్రదేశం. ఈ ప్రదేశంలో మంచి సైక్లింగ్ ట్రాక్‌లు, ప్రకృతి బాటలు, క్యాంపింగ్ స్పాట్‌లు ఉన్నాయి. మీరు ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

4. జిబీ
పైన్ చెట్లు, దేవదార్ చెట్ల పచ్చని అడవుల మధ్య మీకు ఏకాంతం దొరుకుతుంది. ఇది మీకు సరైన ప్రదేశం. జిబి బంజార్ లోయలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది పాత చెక్క ఇళ్ల సమూహాన్ని కలిగి ఉంటుంది. అడవి హైకింగ్, ఫిషింగ్ పక్షుల వీక్షణకు అనువైనది.

5. గుషైని
మీ భాగస్వామితో నక్షత్రాల క్రింద నిద్రించండి. మీ స్నేహితులతో క్యాంపింగ్ స్పాట్‌ను ఏర్పాటు చేయండి. గుషైని ప్రకృతి ప్రేమికులకు, శిబిరాలకు, సాహస ప్రియులకు ఇష్టమైన చోటు. హిమాచల్ ప్రదేశ్ లోని అత్యంత ప్రశాంతమైన ఆఫ్బీట్ ప్రదేశాలలో ఇది ఒకటి.

Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..

TCS JOBS : ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. TCS లో 40 వేల ఉద్యోగ అవకాశాలు.. త్వరలో నియామకాల ప్రక్రియ..

Income Tax Department Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..! ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 155 పోస్టులు..