Travel India: శీతాకాలంలో సూర్యరశ్మిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. మన దేశంలో ఈ ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తమం

|

Nov 14, 2024 | 6:31 PM

వేసవి కాలంలో మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే చలికాలంలో కొంత మంది ఎండ ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా శీతాకాలంలో అలాంటి ప్రదేశాన్ని సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే.. మన దేశంలో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.

Travel India: శీతాకాలంలో సూర్యరశ్మిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. మన దేశంలో ఈ ప్రదేశాలు సందర్శించడానికి ఉత్తమం
Rann Of Kutch
Image Credit source: Morten Falch Sortland/Moment Open/Getty Images
Follow us on

చలికాలంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భారతదేశంలో అనేక ప్రదేశాలను సందర్శించేందుకు ఈ సమయం సరైనది. చల్లని వాతావరణంలో ప్రయాణించే అనుభవం మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సహజ సౌందర్యం రిఫ్రెష్ వాతావరణంలో నడవడానికి, కుటుంబం లేదా స్నేహితులతో కొంత సమయాన్ని గడపడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ సీజన్‌లో ప్రయాణం చాలా ఆనందంగా ఉంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని రుజువు చేస్తుంది.

స్వచ్ఛమైన నీలి ఆకాశం, చల్లని గాలి మనస్సుకు ప్రశాంతతను, విశ్రాంతిని ఇస్తాయి. చలికాలంలో పచ్చదనం, ఎండల మధ్య నడిస్తే వచ్చే ఆనందమే వేరు. చలి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడే వారు కూడా ఉన్నారు. మీరు కూడా చలికాలం చల్లదనాన్ని.. సూర్య రశ్మిని ఇచ్చే ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.

రాజస్థాన్
రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఇసుక చాలా దూరం కనిపిస్తుంది. మీరు ఇక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాదు రాజస్థాన్‌లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. పింక్ సిటీగా పిలువబడే జైపూర్‌ని సందర్శించవచ్చు, ఇక్కడ హవా మహల్, నహర్‌ఘర్ కోట, అమెర్ ఫోర్ట్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్‌లను సందర్శించవచ్చు. సరస్సుల నగరమైన ఉదయపూర్‌లో సజ్జన్‌గఢ్ కోట, ఫతే సాగర్ సరస్సు, ఎక్లింగ్ టెంపుల్, వింటేజ్ కార్ మ్యూజియం, జైసమంద్ సరస్సు వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. అంతేకాదు జైసల్మేర్, మౌంట్ అబూలోని అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

అలెప్పి: కేరళలోని అలెప్పి సందర్శించడానికి మంచి సముయం ఈ శీతాకాలం. ఇది చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ హౌస్‌బోట్‌లో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ హౌస్‌బోట్‌లలో బెడ్‌రూమ్‌లు, బాత్‌రూమ్‌లు, సన్‌డెక్స్, AC సహా అనేక ఇతర సౌకర్యాలు ఉన్నాయి. కుట్టనాడ్, పతిరమణల్, అంబలపుజమందిర్, తాటి చెట్లతో చుట్టుముట్టబడిన ఇసుక సముద్రానికి ప్రసిద్ధి చెందిన మరారికులం, అంతేకాదు అలెప్పీ బీచ్, మరారి బీచ్, వెంబనాడ్ సరస్సును సందర్శించవచ్చు.

రాన్ ఆఫ్ కచ్: గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్‌ని సందర్శించవచ్చు. ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం ఇక్కడ రణ్ ఉత్సవ్ నిర్వహిస్తారు. ఇక్కడ వాకింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ సంవత్సరం రన్ ఉత్సవ్ 11 నవంబర్ 2024 నుంచి 25 మార్చి 2025 వరకు జరుగుతుంది. రాన్ ఆఫ్ కచ్ తెల్లని ఇసుకకు ప్రసిద్ధి. సూర్యోదయం , సూర్యాస్తమయం సమయంలో సూర్యకాంతి ఇసుకపై పడినప్పుడు, ఇక్కడి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గుడారాలలో ఉండే అవకాశం ఉంది. ఇది ఎడారి మధ్యలో అద్భుతమైన క్యాంపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..