Sugar Control Tips: ఈ వ్యాయామాలు చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో.. ఇలా ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు

ప్రస్తుత కాలంలో అందరూ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మధుమేహం ఉన్న వారు వారానికి 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలి అంటే రోజుకు 21 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణుల సూచన.

Sugar Control Tips: ఈ వ్యాయామాలు చేస్తే షుగర్‌ వ్యాధి అదుపులో.. ఇలా ట్రై చేయండి అద్భుతమైన ఫలితాలు
Diabetes In Women
Image Credit source: TV9 Telugu

Edited By: Janardhan Veluru

Updated on: Jan 12, 2023 | 4:14 PM

ఉదయాన్నే వ్యాయామం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చురుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామంతో మానసిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో అందరూ షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు కూడా వ్యాయామం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. మధుమేహం ఉన్న వారు వారానికి 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయామం చేయాలి అంటే రోజుకు 21 నిమిషాలకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని నిపుణుల సూచన. ముఖ్యంగా తేలికపాటి వ్యాయాలు చేస్తే మధుమేహాన్ని ప్రభావవంతంగా నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. నిపుణులు సూచించే జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి ఉన్నాయి. 

స్విమ్మింగ్

ఈత శరీరానికి ఉత్తమమైన వ్యాయామంగా పరిగణిస్తారు. ఇది మిమ్మల్ని ఫిట్‌గా మార్చడమే కాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో కూడా చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఈత టైప్-1, టైప్-2 మధుమేహం రెండింటిలోనూ ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్మింగ్ రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా బరువు, రక్తంలో చక్కెర స్థాయిలలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు.

Swimming

జాగింగ్

జాగింగ్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాల్సిన వ్యాయామం. రోజువారీ నడక మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మధుమేహం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో జాగింగ్ కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధం లాంటిది. జాగింగ్ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌లో అంటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉదయాన్నే జాగింగ్ చేయడం చాలా ఉత్తమం. 

ఇవి కూడా చదవండి

సైక్లింగ్

సైక్లింగ్ అనేది ఒక రకమైన ఏరోబిక్స్ వ్యాయామం. ఇది గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే అధిక బరువు, రక్తపోటును నియంత్రిస్తుంది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు సైక్లింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. సైక్లింగ్ అనేది తేలికపాటి ఎక్సర్ సైజ్ గా పరిగణిస్తారు. 

మెట్లు ఎక్కడం

ప్రస్తుతం ఎలాంటి బిల్డింగ్ వద్దకు వెళ్లినా లిఫ్ట్ తప్పనిసరిగా ఉంటుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో మెట్ల మీదుగా వెళ్లే బదులు ఒక ఫ్లోర్ నుంచి మరో ఫ్లోర్‌కి వెళ్లేందుకు లిఫ్టులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల వారి శారీరక శ్రమ మరింత తగ్గుతుంది. కానీ, ఆరోగ్యంగా ఉండేందుకు మీరు మెట్లను ఎక్కడం ఉత్తమం. ఒక అధ్యయనం ప్రకారం, మెట్లు ఎక్కితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంటాయి.

యోగా

అనేక వ్యాధుల నుంచి బయటపడేందుకు యోగా అనేది ఓ సాదనంగా పని చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యోగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఎముకలను బలపరుస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం రోజూ అరగంట పాటు యోగా చేయడం వల్ల మధుమేహం సమస్య చాలా వరకు తగ్గుతుంది.

Shilpa Shetty Yoga

డ్యాన్స్

డ్యాన్స్ ఉత్తమ వ్యాయామంగా వైద్యులు పరిగణిస్తారు. ఇది మనల్ని అలరించడంతో పాటు డిప్రెషన్‌ను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా డ్యాన్స్ చేస్తే మధుమేహం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. డ్యాన్స్ చేయడం వల్ల జీవక్రియ కూడా మెరుగై మధుమేహం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అంటే, మీరు డయాబెటిస్ ఉన్న రోగి అయితే, మీరు తప్పనిసరిగా నృత్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం