Toothbrush Replaced : మీరు కరోనా వ్యాధి నుంచి బయటపడిన వెంటనే మీ టూత్ బ్రష్ మార్చాలి. లేదంటే చాలా అనర్థాలు జరుగుతాయి. అదే బ్రష్ వాడితే మళ్లీ కరోనా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బ్రష్ మార్చాలని ఆరోగ్య నిపుణులు సుచిస్తున్నారు. కోవిడ్ కేంద్రాలు, ఆసుపత్రులలో దీనిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. కొన్ని చోట్ల రోగులకు టూత్ బ్రష్ ఇస్తారు. డిశ్చార్జ్ అయిన రోజున మరొక టూత్ బ్రష్ ఇస్తారు. దీని వెనుక ముఖ్యమైన కారణం ఇదే.
కరోనా భారతదేశంలో జోరందుకుంది. ప్రత్యేకత ఏమిటంటే చాలామందికి రెండో సారి కూడా కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది. కనుక అందరిలో ఆందోళన పెరిగింది. ఆక్సిజన్ లోపం చాలా చోట్ల కనిపిస్తుంది. కొన్నిచోట్ల బెడ్స్ దొరకడం కష్టమవుతుంది. కనుక కరోనా రాకుండా ముందే జాగ్రత్త వహించాలి. ఒకవేళ కరోనా సోకితే మళ్లీ రాకుండా ఉండటానికి జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చాక వెంటనే బ్రష్ మార్చాలి. లేదంటే అతని కుటుంబంలోని ఇతర సభ్యులకు కరోనా వచ్చే ప్రమాదం ఉంది.
చాలా ఇళ్లలో ఒకే వాష్‌రూమ్ ఉంటుంది. అందుకే బ్రష్ మార్చితే అందరు సేఫ్‌గా ఉంటారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత ఇప్పటికీ దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారు ఖచ్చితంగా టూత్ బ్రష్ మార్చాలి. కరోనా సంక్రమణ తర్వాత 20 రోజుల తర్వాత టూత్ బ్రష్లు, టూత్ క్లీనర్లను మార్చమని నిపుణులు పౌరులకు సలహా ఇస్తున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు.