మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ హడావుడి మామూలుగా ఉండదు. ఇండ్లీ, దోశ, వడ వంటివి చేయాలంటే ఒక రోజు ముందుగానే కావాల్సిన పిండిని సిద్ధం చేసుకోవటం అవసరం. ఇక చాపతీలు, పూరీలు వంటివి చేయాలంటే ఇంట్లో పిండి నూనె ఉండాలేగానీ, అప్పటికప్పుడు ఈజీగా చేసుకోచ్చు. అంతేకాదు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పూరీలను ఇష్టంగా తింటారు. వెజ్, నాన్ వెజ్ కూరలతో కలిపి తింటే ఈ పూరీలు చాలా రుచిగా ఉంటాయి. పూరీలను తయారు చేసే విధానం అందరికి తెలిసినప్పటికి చాలా మంది వీటిని మెత్తగా, పొంగేలా తయారు చేసుకోలేకపోతుంటారు. పూరీలను మెత్తగా, పొంగేలా ఎలా తయారు చేసుకోవాల్లో ఇక్కడ తెలుసుకుందాం..
ఇటీవల, మాస్టర్ చెఫ్ పంకజ్ భడోరియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నూనె లేకుండా పూరీని తయారు చేసే ఉపాయాన్ని షేర్ చేశారు. ఈ చక్కటి టిప్‌తో మీరు తక్కువ నూనెతో సులభంగా ఉబ్బిన పూరీని తయారు చేసుకోవచ్చు. మీకు నమ్మకం లేకపోతే మీరే ప్రయత్నించండి. అయితే, రోటీలు, పూరీలు చేయటం కోసం పిండిని మెత్తగా కలిపి పెట్టుకుంటుంటారు. కానీ, పూరీలు చేయడానికి పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా పిసికి కలుపుకోవాలంటున్నారు. ఇలా చేయడం వల్ల పూరీ ఉబ్బినట్లుగా కాకుండా ఆయిల్ ఫ్రీగా మారుతుంది. అలాగే, నిల్వ ఉంచిన పిండితో పూరీలను తయారు చేయవద్దంటున్నారు.
మీరు నిల్వ చేసిన పిండితో పూరీని తయారు చేయాలనుకుంటే.. అప్పుడు పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. అలాగే పూరీ పొంగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే పూరీకి తాజాగా కలిపి పిండిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
శుద్ధి చేసిన లేదా సోయాబీన్ వంటి తేలికపాటి నూనెనే పూరీలు వేయించడానికి ఉపయోగించాలి. ఇలాంటి ఆయిల్ వాడితే..తక్కువ నూనెలో ఎక్కువ పూరీలు వేయించుకోవచ్చు. దీనితో పాటు, నూనె కాగిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవటం అవసరం. మీరు వంటలకు నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే..నూనె చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకూడదు.
పూరీలను వేయించేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే నూనెలో కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ ట్రిక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే అలా ఆయిల్‌లో ఉప్పు వేసేటప్పుడు దాని పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు ఎక్కువైతే పూరీలు ఉప్పగా తయారవుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..