Sleep Tips: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. అయితే చాలామంది తమకు నిద్ర పట్టడంలేదని.. వాపోతుంటారు. కొంతమంది నిద్ర లేమితో అనారోగ్యానికి గురవుతుంటారు కూడా.. అయితే మంచి నిద్ర పట్టాలంటే.. తమ దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. అంతేకాదు.. నిద్ర పట్టకుండా చేసే అంశాల గురించి ఆలోచించాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇక కుటుంబ బాధ్యతలు, అనారోగ్యాలు, ఊహించని సంఘటనలు కొన్నిసార్లు నిద్ర పట్టనివ్వకుండా చేస్తాయి. అందుకని మంచి నిద్ర పట్టాలంటే మన దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని చిట్కాలను పాటిస్తే.. హాయిగా నిద్ర పడుతుంది.
ముఖ్యంగా నిద్రకూ ఓ షెడ్యూల్ ఉండాలి. నిద్ర సమయం ఎనిమిది గంటలు అని సాధారణముగా అందరూ భావిస్తారు. అయితే మంచి కలత లేని నిద్ర ఏడు గంటలైనా సరిపోతుంది. నిజానికి వైద్యులు సిఫారసు చేసిన సమయం ఏడు గంటలే. ఎనిమిది గంటలు అవసరం లేదు. ప్రతిరోజూ ఒకే సమయంలో పడుకోవాలి.. ఒకే సమయంలో లేవాలి.
అయితే సర్వసాధారణంగా ఉద్యోగులు తమకు సెలవు వచ్చిన రోజున కంటే ఓ గంట ఆలస్యంగా పడుకోవడం, లేవడం చేయొచ్చు. మీకు సుమారు 20 నిమిషాల్లో నిద్రపట్టకపోతే… మంచి నిద్రకోసం మనసుకు హాయినిచ్చే మ్చూజిక్ వినండి లేదా ఓ మంచి పుస్తకం చదవండి. నిద్ర వచ్చినప్పుడు వెళ్లి పడుకోండి.. ఇక తినే ఆహార పదార్ధాలతో పాటు.. త్రాగే వాటిపైన శ్రద్ధ వహించాలి ఆహారం త్వరగా తీసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే తేలిక పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేసే సుఖ నిద్ర తో పాటు.. మంచి ఆరోగ్యం కూడా మీ సొతం అవుతుంది.
Also Read: కరోనా బాధితులు ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా…!