సాధారణంగా, మన వ్యక్తి ఎలాంటి వాడు, అతని స్వభావం ఎలాంటి అనేది తెలుసుకోవాలంటే.. చాలా మంది అతనితో కాసేపు మాట్లాడడమో, లేదా అతనితో టైం స్పెండ్ చేయడమో చేస్తారు, అలా కాదంటే జోతిష్యం లేదా చేతిరేఖలను ద్వారా అతను ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సాముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీర ఆకారం, కంటి ఆకారం, ముక్కు ఆకారం, పాదాల ఆకారం, చేతి వేళ్ల ఆకారం ద్వారా కూడా మన రహస్య వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవచ్చు. అవును ఒక వ్యక్తి బొటనవేలు ఆకారాన్ని బట్టి అతను ఎలాంటి వాడో తెలుసుకోవచ్చు. ఎలాగంటే ఆ వ్యక్తి బొటనవేలు నిటారుగా ఉందా లేదా వంపుతిరిగి ఉందా అనే దాని ఆధారంగా ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది తెలుసుకోవచ్చు. అదెలానో నేటి వ్యక్తిత్వ పరీక్షలో తెలుసుకుందాం.
మీ బొటనవేలు ఆకారం బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి
నిటారుగా ఉన్న బొటనవేలు: మీ చేతికి ఉన్న బొటనవేలు నిటారుగా ఉంటే, మీరు లాజికల్‌గా ఆలోచించే వ్యక్తి అని అర్థం. అలాగే మీరు మూడ నమ్మకాలను కాకుండా ప్రాక్టికల్‌గా నిజజీవితంలో జరిగే విషయాలను మాత్రమే నమ్ముతారని అర్థం. అలాగే మీరు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాల కాకుండా వాస్తవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. అలాగే మీరు ఎక్కువ పట్టుదల కలిగిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులను ఎవరూ డామినేట్ చేయలేరు. వీరు చేసే ప్రతి పనిలో వీళ్లు కఠినంగా ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
వెనుకకు వంగిన బొటనవేలు: ఒక వ్యక్తి చేతి బొటనవేలు వెనకకు వంగి ఉంటే.. వాళ్లు భావోద్వేగమైన మనస్థత్వం కలిగిన వారని అర్థం. అంటే వీరు ప్రాక్టికల్‌గా ఆలోచించకుండా, ఎమెషనల్ ఫీలింగ్స్ ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. అంటే సందర్భాన్ని బట్టి వారు తమ నిర్ణయాలను మార్చుకుంటారు. కొన్ని సార్లు వాస్తవాల కంటే ఎమోషనల్‌గా తీసుకునే నిర్ణయాలే నిజమైన బంధాలకు బాటలు వేస్తాయి. వీరు బంధుత్వాలకు కూడా ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు. వీరు తోటి వారితో చాలా సింపుల్‌గా కలిసిపోతారు. వీరు నమ్మిన, ప్రేమించే వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. మొత్తంగా చెప్పాలంటే.. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి నచ్చుతారు.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన అంశాల ఆధారంగా మాత్రమే అందించబడినది.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.