అధిక బీపీ ఉన్నవారికి కొవిడ్ ప్రమాదం..? ఈ విషయాలు తెలుసుకొని.. కరోనా నుంచి జాగ్రత్త పడండి..!

|

May 07, 2021 | 6:05 PM

High Blood Pressure : కొవిడ్ రెండో వేవ్ మొదటి దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, లక్నో, పూణేతో

అధిక బీపీ ఉన్నవారికి కొవిడ్ ప్రమాదం..? ఈ విషయాలు తెలుసుకొని.. కరోనా నుంచి జాగ్రత్త పడండి..!
High Blood Pressure
Follow us on

High Blood Pressure : కొవిడ్ రెండో వేవ్ మొదటి దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది. ఇది దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, లక్నో, పూణేతో సహా దేశంలోని పెద్ద నగరాలను నాశనం చేసింది. ఆక్సిజన్, కొవిడ్ ఔషధాల కొరత కారణంగా దేశం అల్లకల్లోలంగా మారింది. యువత జీవితాలను ప్రమాదంలో పడేసింది. డయాబెటిస్, రక్తపోటు, గుండె పరిస్థితులు ఇతర అనారోగ్య సమస్యలున్నవారు డేంజర్ జోన్ లోకి వస్తారు. వీరికి కరోనా సోకినట్లయితే తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటారు.

మీకు అధిక రక్తపోటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు అదనపు ప్రయత్నం చేయాలి. కోవిడ్ -19 సమయంలో రక్తపోటు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇది అధిక మరణాల పెరుగుదలకు దారితీస్తుంది. రక్తపోటు, డయాబెటిస్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ఊబకాయం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొవిడ్ మరణాలలో అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఎక్కువని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి.

వైరస్ మొదటగా రక్తపోటును నిర్వహించడానికి అవసరమయ్యే కణాలకు సోకుతుంది. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. బలహీనంగా మారి కోవిడ్ -19 కి బలైపోవచ్చు. 60 ఏళ్లు పైబడిన చాలా మందికి అధిక రక్తపోటు ఉంటుంది. కోవిడ్ -19 తో ఆసుపత్రిలో చేరిన చాలామందికి ముందుగా ఉన్నది రక్తపోటు మాత్రమే. అధిక రక్తపోటు స్ట్రోక్, ఇతర గుండె సమస్యలకు దారితీస్తుంది.

అధిక రక్తపోటు కలిగి ఉండటం వల్ల మీ ధమనులు దెబ్బతిని, మీ గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అందువల్ల మీ గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయడానికి మరింత కష్టపడాలి. ఇది మీ హృదయాన్ని బలహీనపరుస్తుంది. అధిక రక్తపోటుతో మీ గుండె దెబ్బతిన్నట్లయితే చాలా తొందరగా కోవిడ్ -19 అటాక్ అవుతుంది. అందుకే బీపీ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Viral News: అయ్యో.! పాపం బాతు..!! గుర్రానికి అడ్డు తగిలింది.. ప్రాణం మీదుకు తెచ్చుకుంది..

Indian Railways: కరోనా ఎఫెక్ట్‌.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?

శరీరంలో ఐరన్ లోపిస్తే చాలా డేంజర్..! మీకు ఈ లక్షణాలు ఉన్నాయో ఒక్కసారి చూసుకోండి..