Spinach for Diabetes: షుగర్ పేషెంట్స్ పాలకూర తింటే జరిగేది ఇదే..

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది. డయాబెటీస్‌కు రాజధానిగా భారత దేశం మారిందంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే షుగర్ ఉన్నవారి సంఖ్య ఎక్కువ. షుగర్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ మరింత ఎక్కువై ప్రాణాల మీదకు వచ్చింది. షుగర్ వ్యాధిని తగ్గించే ఆహార నియమాల గురించి ఇప్పటికే,,

Spinach for Diabetes: షుగర్ పేషెంట్స్ పాలకూర తింటే జరిగేది ఇదే..
Spinach for Diabetes

Edited By:

Updated on: Jul 24, 2024 | 9:47 PM

ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతుంది. డయాబెటీస్‌కు రాజధానిగా భారత దేశం మారిందంటే.. అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలోనే షుగర్ ఉన్నవారి సంఖ్య
ఎక్కువ. షుగర్ వ్యాధి ఉన్నవారు ఆహారం విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ మరింత ఎక్కువై ప్రాణాల మీదకు వచ్చింది. షుగర్ వ్యాధిని తగ్గించే ఆహార నియమాల గురించి ఇప్పటికే చాలా సార్లు తెలుసుకున్నాం. ఈ క్రమంలోనే డయాబెటీస్ ఉన్నవారు పాల కూర తినవచ్చా? తింటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్సులిన్‌ని మెరుగు పరుస్తుంది:

షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో పాలకూర చక్కగా పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. పాల కూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా మెరుగు పరుస్తుంది. అదే విధంగా పాలకూరలో ఉండే ఫైబర్‌తో కూడా షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి:

పాలకూరలో లుటిన్, జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కణాలను రక్షించడంలో సహాయ పడతాయి. అదే విధంగా డయాబెటీస్‌తో సంబంధం ఉన్న కాంప్లికేషన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి ఎక్కువ:

పాలకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సిలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహించడంలో హెల్ప్ చేస్తాయి. షుగర్ పేషెంట్స్‌ త్వరగా అలిసిపోతూ ఉంటారు. కాబట్టి వీరికి శక్తిని ఇచ్చేందుకు ఇమ్యూనిటీ సహాయ పడతాయి.

రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి:

పాలకూరలో విటమిన్లు ఎ, సిలు ఉంటాయి. ఇవి రక్త నాళాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా షుగర్‌తో సంబంధం ఉన్న కాంప్లికేషన్స్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎలాంటి సందేహం, భయం లేకుండా పాలకూర తీసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..