
కూరగాయల్లో బ్రోకలీ కూడా ఒకటి. బ్రోకలీ అచ్చం క్యాలీ ఫ్లవర్‌లానే ఉండే ఉంటుంది. బ్రోకలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం అందరిలో ఆరోగ్యంపై అవగాహన అనేది పెరిగింది. దీంతో చాలా మంది బ్రోకలీ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్రోకలీలో అనేక పోషకాలు ఉంటాయి. బ్రోకలీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తి ఆరోగ్యకరమైన పోషకాలు ఇందులో నిండి ఉంటాయి. బ్రోకలీలో విటమిన్లు ఎ, సి, కె, పొటాషియం, ఫోలేట్, మాంగనీస్, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, రైబో ప్లేవిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి బ్రోకలీలో అధికంగా లభ్యమవుతాయి. బ్రోకలీని సూపర్ ఫుడ్‌గా నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లుతో పాటు ఫ్లేవనాయిడ్స్, సల్ఫోరాఫేన్ వంటివి ఉంటాయి. ఈ శక్తివంతమైన పోషకాలు.. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ వంటివి రాకుండా చేస్తుంది. అదే విధంగా శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
బ్రోకలీలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బ్రోకలీలోని ఫైబర్.. జీర్ణ వ్యవస్థలోని కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. అదే విధంగా రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
బ్రోకలీ తినడం వల్ల డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది. బ్రోకలీలో ఉండే ఫైబర్.. తిన్న ఆహారాన్ని నెమ్మదించేలా చేస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి ఒక్కసారిగా పెరగవు. బ్రోకలీ తినడం వల్ల డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది.
బ్రోకలీ తినడం వల్ల బరువు కూడా కంట్రోల్ అవుతుంది. ఇందులో కేలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బ్రోకలీ కొద్దిగా తిన్నా.. కడుపు నిండిన ఫీలిగ్ ఉంటుంది. అలాగే రోజంతా మీరు తినే క్యాలరీల సంఖ్యను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..