
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాలని మనందరికీ తెలిసిందే. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలన్నా, నిత్యం ఆరోగ్యంగా ఉండాలన్నా విటమిన్లు సమకూరాల్సిందే. ఇలాంటి వాటిలో విటమిన్ సి ఒకటి. ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో విటమిన్ సి లోపం ఉంటే ఎన్నో రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంతకీ మహిళలకు విటమిన్ సీ అంత అవసరం ఏముంటుంది. శరీరానికి సరిపడ విటమిన్ సి లభించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ముఖ్యమైనది. అలాగే విటమిన్ సి కండరాలు, అవయవాలకు చాలా మేలు చేసే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. కొల్లాజెన్ నిర్మాణానికి ఇది చాలా మంచిది. విటమిన్ సి తీసుకోవడం వల్ల ముడతలు తగ్గుతాయి.
ఇది మహిళలు ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపించేలా చేయడంలో ఉపయోగపడుతుంది. గర్భిణులు, పాలిచ్చే మహిళలు విటమిన్ సిని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ సి సప్లిమెంట్లు గర్భిణీల్లో సాధారణంగా తలెత్తే సమస్యలను దూరం చేస్తాయి. ఇక మహిళలకు సాధారణంగా రుతు క్రమం సమయంలో వచ్చే సమస్యలకు విటమిన్ సీతో చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో నొప్పిని దూరం చేయడంలో విటమిన్ సి ఉపయోగపడుతుంది.
అలాగే ఒత్తిడి, రక్తపోటును కూడా అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల్లో సాధారణంగా కనిపించే హార్మోన్ల అసమతుల్యతకు విటమిన్ సీతో చెక్ పెట్టొచ్చు. మహిళల్లో వచ్చే గుండె జబ్బులను కూడా విటమిన్‌సితో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను అధిక రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి మహిళలు కచ్చితంగా ప్రతీ రోజూ తాము తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..