Castor Oil: ఆముదాన్ని ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే!

|

Nov 16, 2024 | 5:02 PM

ఆముదం ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంతకు ముందు ఎక్కువగా ఆముదాన్నే ఉపయోగించారు. కానీ ఇప్పుడు అనేక ఆయిల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. కానీ ఆముదాన్ని ముఖానికి రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి..

Castor Oil: ఆముదాన్ని ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే!
Castor Oil
Follow us on

ఆముదం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయుదం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడంటే అనేక రక రకాల ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం చర్మానికి, జుట్టుకు ఆముదాన్ని మాత్రమే వాడేవారు. ఆముదం ఆరోగ్యాన్ని, అందాన్ని పెండచంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆముదాన్ని ఎక్కువగా జుట్టుకే ఉపయోగిస్తారు. కానీ చర్మానికి ఉపయోగించడం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఆముదాన్ని చర్మానికి రాయడం వల్ల చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మరి చర్మానికి ఆముదాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

ఆముదంలో పోషకాలు:

ఆముదంలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, లినోలిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్ వంటివి, ఓమేగా 6, ఓమేగా 9 వంటి మంచి కొవ్వులు కూడా లభిస్తాయి. వీటి వలన ముఖానికి మంచి గ్లో వస్తుంది.

ముడతలు కంట్రోల్:

ఆముదాన్ని ముఖానికి రాయడం వల్ల ముడతలు కంట్రోల్ అవుతాయి. చర్మంపై కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్కిన్‌పై ఉండే ముడతలను తగ్గిస్తుంది. ఆముదాన్ని స్కిన్‌పై రాస్తే వయసు అయిపోయినా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలు:

ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇది పగిలిన చర్మాన్ని, పింపుల్స్‌ను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ముఖంపై పేరుకుపోయినా మురికిని తొలగిస్తుంది. దీంతో మొటిమలు ఎక్కువగా రాకుండా కంట్రోల్ చేస్తుంది. మొటిమలను తగ్గించడంలో ఆముదం చక్కగా పని చేస్తుంది.

కాంతివతంగా:

చర్మంపై ఆముదం రాయడం వల్ల హైడ్రేట్ అవుతుంది. తేమగా, మృదువుగా ఉంటుంది. దీంతో నేచురల్‌గానే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. చర్మం గ్లోగా, సాఫ్ట్‌డి మారుతుంది. పొడి చర్మంతో బాధ పడేవారు.. ఆముదం రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎలా వాడాలి:

ముందుగా చర్మంపై ఆముదం రాసే ముందు శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కోండి. ఆ తర్వా ఆముదాన్ని నేరుగా కూడా రాసుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, బాదం వంటి ఆయిల్స్‌లో కూడా మిక్స్ చేసి రాసుకోవచ్చు. చర్మంపై రాసి కాస్త మసాజ్ చేసి రాత్రంతా అలానే వదిలేయాలి. ఇలా చేస్తే మంచి గ్లో వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.