
నేతి బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు : శనగపప్పు ఒక కప్పు, బెల్లం పావు కప్పు, గోధుమ పిండి పావు కప్పు, మైదా పిండి కప్పు, యాలకుల పొడి వన్ టీ స్పూన్. నెయ్యి నాలుగు స్పూన్స్.

తయారీ విధానం : ముందుగా శనగ పిండిని శుభ్రంగా కడికి, స్టవ్ ఆన్ చేసి పప్పును ఉడకబెట్టుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత అందులో పావు కప్పు బెల్లం, వన్ టీ స్పూన్ యాలకుల పొడి, వన్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలిపి దాదాపు 15 నిమిషాల పాటు లో ప్లేమ్ మంటపై ఉడకబెట్టుకోవాలి.

ఇప్పుడు పిండిని సిద్ధం చేసుకోవాలి. దీని కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మైదా పిండిని జల్లెడ పట్టి తీసుకోవాలి. తర్వాత గోధుమ పిండిని కూడా జల్లెడ పట్టి తీసుకోవాలి. రెండు మంచిగా కలుపుకోవాలి.తర్వాత అందులో వన్ టీ స్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి, కొద్దిగా నీరు పోస్తూ చపాతీ పిండి టైప్‌లో కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలుపుకుంటే బొబ్బట్లు అంత టేస్టీగా బాగా వస్తాయి.

పిండి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని మంచిగా, మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండూ ఒకే దగ్గర పెట్టుకొని బొబ్బట్లు లేదా భక్ష్యాలు తయారు చేసుకోవాలి.

పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని రోటీలా తాల్చుకోవాలి. తర్వాత అందులో శనగపప్పు మిశ్రమం చిన్న ముద్దలా చేసి, పెట్టుకొని మెల్లిగా తాల్చుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్ట, దానిపై నెయ్యి వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ.