
కోపం ప్రతీ మనిషికి ఉండే సర్వసాధారణమైన ఎమోషన్. అయితే ఈ ఎమోషన్ మనిషిపై మానసికంగా ఎంతో నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతుంది. అందుకే కోపాన్ని తగ్గించుకోవాలని చెబుతుంటారు. ‘తన కోపమే తనకు శత్రవు’ అంటూ పద్యాల రూపంలో కూడా కోపం వల్ల కలిగే దుష్ప్రభావాలను మన పెద్దలకు మనకు వివరించారు.
ఇక కోపం రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో కోపానికి విటమిన్ లోపం కూడా ఓ కారణమని మీకు తెలుసా.? అవును కొన్ని రకాల విటమిన్ల లోపం కారణంగా మనిషికి ఊరికే కోపం వస్తుంది.? ఇంతకీ ఏ విటమిన్స్ లోపం వల్ల తరచూ కోపం వస్తుంది. దీనికి చెక్ పెట్టడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* విటమిన్ బీ6 లోపం ఉంటే మనిషి తరచూ కోపానికి గురవుతాడని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ మెదడుకుపై ప్రభౄవం చూపుతుంది. మెదడు పనితీరు సరిగ్గా పనిచేయాలంటే ఆహారంలో విటమిన్ బీ6 ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి సరిపడ బీ6 విటమిన్ అందకపోతే నిత్యం కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇక కోపం ఎక్కువగా రావడానికి మరో ప్రధాన కారనం విటమిన్ బీ12 లోపం. ఈ విటమిన్ లోపం కారణంగా నిత్యం అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన విషయాలకు చిరాకు రావడం ఈ విటమిన్ లోపమే కారణం. ఇక విటమిన్ బీ12 లోపం కారణంగా డిప్రెషన్‌కు కూడా గురవుతారని నిపుణులు చెబుతున్నారు.
* శరీరానికి సరిపడ జింక్ లభించకపోయినా మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. జింక్ లోపం కారణంగా మానసిక కల్లోలం, ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటివి వేధిస్తాయిని నిపుణులు చెబుతున్నారు.
* మెగ్నిషియం కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడ మెగ్నీషియం లభించకపోతే మానసిక ఒత్తడి పెరుగుతుంది. దీంతో ఇది నిత్యం చికాకు కలగడానికి కారణమవుతుంది.
* కారణం లేకపోయినా కోపం తెచ్చుకోవడం, నిత్యం మానసిక ఒత్తిడతో బాధపడేవారు వారు ఆహారంలో కచ్చితంగా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ బూడ్ బూస్టింగ్ ఫుడ్స్‌ని తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆహారంలో విటమిన్ బీ6, విటమిన్ బీ12 అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతున్నారు. పచ్చి ఆకు కూరలు, అవకాడోతో పాటు మాంసాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటితో పాటు జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే.. చేపలు, బ్రోకలీ, మొలకలు వంటి వాటిని ఆహౄరంలో భాగం చేసకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..