Diabetes in Women: మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు కూడా డయాబెటీస్‌ ఎఫెక్టే..

|

Dec 02, 2024 | 1:53 PM

సాధారణంగా డయాబెటీస్‌తో బాధ పడేవారి సంఖ్య బాగా ఎక్కువవుతుంది. అనేక కారణాల వల్ల డయాబటెీస్ అనేది ఎటాక్ చేస్తుంది. అయితే మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెక్ చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

Diabetes in Women: మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు కూడా డయాబెటీస్‌ ఎఫెక్టే..
Diabetes In Women
Follow us on

ప్రస్తుతంలో రోగాల సంఖ్య బాగా ఎక్కువై పోతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వ్యాధి ఎటాక్ చేస్తుందో తెలీక జనాలు కలవరం పడుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో డయాబెటీస్ వ్యాధి అనేది చాప కింద నీరులా విస్తరిస్తుంది. యంగ్ ఏజ్‌లో ఉండే వారిలో కూడా ఈ వ్యాధి లక్షణలు కనిపిస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం తినే ఆహారంలో మార్పులేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఎటాక్ చేయడానికి అనేక ఇతర కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు, లైఫ్ స్టైల్ విధానం, సరైన సమయానికి తినకపోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వ్యాధి లక్షణాలు అనేది ఒకేలా ఉంటాయని చెప్పడం కష్టం అనే చెప్పొచ్చు. మగవారిలో ఒకలా.. ఆడవారిలో మరొకలా కనిపిస్తున్నాయి. మహిళల్లో ఈ లక్షణాలు కనిపించినా.. డయాబెటీస్‌కు కారణం అని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూడండి.

ఉన్నట్టుండి బరువు కోల్పోడం:

ఇంట్లోని అందరి ఆరోగ్యం చూసుకునే మహిళలు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. ఆహారాన్ని చాలా లేటుగా తీసుకోవడమే కాకుండా.. హెల్దీ ఫఉడ్ తీసుకోరు. డయబెటీస్ కారణంగా చాలా మందిలో బరువు అనేది తగ్గిపోతారు. అకస్మాత్తుగా ఎవరైనా బరువు తగ్గిపోతే.. ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించడం లేము. ఈ బరువు తగ్గడం అనేది అనేక వ్యాధులకు కారణం కావచ్చు.

బాగా నీరసంగా ఉండటం:

ఉన్నట్టుండి నీరసంగా అనిపించడం, ఏ పనీ చేయలేక పోవడం వల్ల కూడా షుగర్ వ్యాధికి కారణం కావచ్చు. కొందరిలో చూపు కూడా మందగిస్తుంది. అలసటగా నీరంగా ఉంటుంది. కాళ్లు, చేతుల్లో ఎక్కువగా తిమ్మిరి ఎక్కినట్లుగా, ఇతర సమస్యలు మందులు వాడినా తాత్కలికంగానే తగ్గినట్లు అనిపిస్తుంది. అనంతరం మళ్లీ నీరసంగానే అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆకలి ఎక్కువ:

కొంతరిలో ఆకలి అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో ఈ లక్షణం కనిపించదు. షుగర్ ఉన్నవారికి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తింటూనే ఉంటారు.

గాయాలు మానకపోవడం:

డయాబెటీస్ ఉన్నవారిలో గాయాలు అనేవి త్వరగా మానవు. ఈ లక్షణం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ ఫెక్షన్లు, గాయాలు మానవు. రోగ నిరోధక శక్తి కూడా క్షీణిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..