Potato Side Effects: బంగాళాదుంపలు ఇది దుంప జాతికి చెందిన ఒక కూరగాయ. ఇది చాలా మందికి ఫేవరేట్ కూడా. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే కూరగాయల్లో ఇది ఒకటి. ఇక పొటాటో (Potato) చిప్స్ అయితే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇందులో పొటాషియం, విటమిన్లు-ఎ, సి, మెగ్నీషియం, జింక్, ఐరన్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని సరైన మోతాదులో తీసుకోవాలని వైద్య, ఆరోగ్య నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఇందులోని కార్బొహైడ్రేట్లు, గ్లూకోజ్‌లు, అమైనో ఆమ్లాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. అదే సమయంలో బంగాళా దుంపలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..
అధిక బరువు
బంగాళదుంపలో పలు పోషకాలు ఉంటాయి. అయితే బరువును పెంచే పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని సరైన మోతాదులోన తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేయించిన, ఉడికించిన బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోకూడదంటారు.
ఎసిడిటీ
బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ, గ్యాస్ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అదేవిధంగా కడుపు ఉబ్బరం సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక రాత్రి భోజనంలో బంగాళదుంపలు అసలు తినకూడదు. ఒకవేళ తిన్నా తక్కువగానే తీసుకోవాలి.
మధుమేహం
మధుమేహం, బీపీ తదితర వ్యాధులతో బాధపడేవారు బంగాళాదుంపలకు దూరంగా ఉంటాలంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఇందులో ఉండే నేచురల్ షుగర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి డయాబెటిక్ రోగులు వీటికి దూరంగా ఉండాలి లేదా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
Crime news: కన్న తండ్రి అని కూడా చూడకుండా.. పారతో కొట్టి చంపాడు.. విచారణలో షాకింగ్ విషయాలు