మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా ఉదయం అకస్మాత్తుగా పెరిగిన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన, పాదాలు మంట, తలనొప్పి, నిద్రలేమి, చేతులు, కాళ్ళలో నొప్పి వంటి ఈ సమస్యలన్నీ రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని చెప్పే సంకేతాలు. అందుకోసం రాత్రిపూట ఈ చిట్కాలు పాటించండి. ఈ చిట్కాలు పాటిస్తే ఉదయం అల్పాహారం తర్వాత మీ బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడానికి దోహద పడతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శారీరక శ్రమ..
రాత్రి భోజనం తర్వాత కొంత శారీరక శ్రమ చేయడం వల్ల మీ శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది ఉదయం పూట రక్తంలో చక్కెర స్థాయిని చాలా సులభంగా నియంత్రించడంలో సహాయపడుతుంది.
యోగా సాధన..
యోగా సాధనతో ఉదయాన్నే మీ శరీరంలో పెరిగిన మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు. రాత్రి భోజనం తర్వాత వజ్రాసనం వంటి యోగా వ్యాయామాలు చేయడం వల్ల ప్యాంక్రియాస్ బాగా పని చేస్తుంది.
స్వీట్లు నిషేధించాలి..
భోజనం తర్వాత బేకరీ డెజర్ట్‌లు, ఇంట్లో తయారుచేసిన డెజర్ట్‌లను కూడా తినవద్దు. ఎందుకంటే మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనికి ఎక్కువ స్వీట్లను జత చేయటం వల్ల ఉదయానికి మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి.
ఎక్కువ నీరు త్రాగాలి..
భోజన సమయంలో నీళ్లు తాగకూడదని అంటారు. కానీ భోజనం చేసిన గంట తర్వాత ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మీ ఆహారంలో చక్కెర మొత్తం నీటిలో కరిగిపోతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
దంతాల శుభ్రత ముఖ్యం..
మధుమేహం ఉన్నవారు తరచుగా దంతాలు, చిగుళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు పళ్లు తోముకోవడం, నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది దంతాల మీద బ్యాక్టీరియా వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.
విందు ముందు సలాడ్..
భోజనానికి ముందు 300 గ్రాముల సలాడ్ తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్లు తగ్గుతాయి. అంటే కార్బోహైడ్రేట్ రక్తంలో కరగదు. ఇది శరీరంలో ఎక్కువ సేపు ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..