Sunstroke Control Tips: వీటితో వడ దెబ్బ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!

వేసవి మొదలైపోయింది. భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. ఎండ దుమ్ము లేపుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 41 డిగ్రీలకు చేరుకుంటుంది. వచ్చే రెండు నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా పెరగనుంది. వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు..

Sunstroke Control Tips: వీటితో వడ దెబ్బ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!
Sunstroke Control Tips

Updated on: Mar 09, 2024 | 7:33 PM

వేసవి మొదలైపోయింది. భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలు దాటిందంటే చాలు.. ఎండ దుమ్ము లేపుతుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా 41 డిగ్రీలకు చేరుకుంటుంది. వచ్చే రెండు నెలల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా పెరగనుంది. వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వడ దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పానీయాలతో మీ ఆరోగ్యాన్ని చాలా వరకూ కాపాడుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్లు:

వేసవి వచ్చిందంటే.. నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కొబ్బరి నీళ్లు చాలా చక్కగా పని చేస్తాయి. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవి తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అంతే కాకుండా బాడీ ఎనర్జిటిక్‌గా మారుతుంది. వేసవి వడగాల్పుల్ని ఎదుర్కొనేందుకు ఇవి అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. నీరసం, బలహీనత వంటివి దరి చేరకుండా ఉంటాయి.

మజ్జిగ:

వేసవిలో మరో బెస్ట్ డ్రింక్ ఏది అంటే మజ్జిగ అని చెప్పొచ్చు. సమ్మర్‌లో బాడీ చాలా హీట్ అవుతుంది. ఈ హీట్‌ని తగ్గించాలంటే.. శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అంతేకాకుండా బాడీలో మెటబోలిజం కూడా వేగవంతమౌతుంది. గట్‌కు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. మజ్జిగలో విటమిన్లు, మినరల్స్, ప్రోబయోటిక్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సిట్రస్ ఫ్రూట్స్:

వేసవి తాపం నుంచి తక్షణమే ఉపశమనం ఇచ్చే వాటిల్లో సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి. అందుకే సమ్మర్‌లో ఆరెంజ్, లెమన్ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకుంటే రోగ నిరోధక శక్తి లభించడంతో పాటు.. ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. చర్మ సమస్యలు కూడా పెద్దగా తలెత్తవు.

పుచ్చకాయ:

వేసవిలో ఎక్కువగా లభించే వాటిల్లో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చ కాయలో నీటి శాతంతో పాటు విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్ల బరచడంతో పాటు.. ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..